AP Police Constable-2025: ఏపీ కానిస్టేబుళ్ల నియామక ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం మంగళగరిలోని డీజీపీ ఆఫీసులో హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆయా ఫలితాలను విడుదల చేశారు. విడుదలైన ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఎట్టకేలకు ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వాటిని విడుదల చేశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ఫలితాలను ఉంచారు.
గండి నానాజి 168 మార్కులతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. 159 మార్కులతో రమ్య మాధురి సెకండ్ ప్లేస్ కాగా, 144.5 స్కోర్ తో అచ్యుతారావు మూడో స్థానంలో నిలిచాడు. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 6,100 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. 2023లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది ప్రభుత్వం.
ఆరువేల పైచిలుకు పోస్టులకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 95 ,208 మంది అభ్యర్థులు పాసయ్యారు. అయితే వీరికి 2024 డిసెంబరులో ఫిజికల్ పరీక్షలు నిర్వహించారు. అందులో కేవలం 38,910 మంది అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షలకు 37,600 మంది హాజరయ్యారు. అందులో 33,921 మంది అర్హత సాధించారు.
ALSO READ: జగన్ నెల్లూరు టూర్ ఎఫెక్ట్.. మూడు కేసులు
కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలుపెట్టి రెండేళ్లు అవుతోంది. ఆనాటి నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, వాటిపై దృష్టి పెట్టింది. పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో వాటిపై ఫోకస్ చేసింది. వీలైనంత తొందరగా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఎంపికైన వారికి త్వరలో శిక్షణ మొదలుకానుంది.