E-Paper
Advertisement

హీరో జయంరవికి కోర్టులో ఊరట.. భార్యకి షాక్!

హీరో జయంరవికి కోర్టులో ఊరట.. భార్యకి షాక్!
Advertisement

Jayam Ravi: ఇటీవల కాలంలో ఎంతో అన్యోన్యంగా ఉండే సెలెబ్రిటీలు అనూహ్యంగా విడాకులు కోరుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి జంటలలో జయం రవి (Jayam Ravi), ఆర్తి (Arti)కూడా ఒకరు. పైగా ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారే. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కానీ సడన్గా విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం అభిమానులు తట్టుకోలేకపోయారు. విడాకులు ప్రకటించిన తర్వాత అటు జయం రవి, ఇటు ఆర్తి ఎవరికి వారు తమ వాదనలను వినిపించిన విషయం తెలిసిందే. అలా ఈ విషయం గత రెండు సంవత్సరాలుగా కోర్టులో నడుస్తూనే ఉంది.

భార్యతో విడాకులు.. జయం రవికి భారీ ఊరట..

ముఖ్యంగా రవి తన భార్య తనకు విడాకులు ఇవ్వకుండా టార్చర్ చేస్తోంది అంటూ వాపోయారు. అటు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ (Kenisha Francis) తో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు కెనీషాతో కలిసి గోవాలో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశారని, అందులో స్టేటస్ దగ్గర సింగిల్ అని మెన్షన్ చేశాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అలా రోజుకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా తన భర్త నుండి విడాకులు పొందాలంటే ప్రతి నెల రూ.40 లక్షలు భరణం ఇవ్వాల్సిందే అని తన నిర్ణయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఆర్తికి కోర్టు షాక్ ఇస్తూ.. ఇచ్చిన తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

also read:షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!

ఆర్తికి షాక్ ఇచ్చిన కోర్టు..

ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం.. రవితో విడాకుల నేపథ్యంలో ప్రతి నెల భరణం కింద రూ.40లక్షలు కోరగా.. అందుకు కోర్టు సమ్మతించలేదని.. ప్రతినెల రూ.3లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు పిల్లలను కలవనీయకుండా భార్య ఆర్తి అడ్డుకుంటున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో.. పిల్లలను తండ్రి నిర్దిష్ట నిర్బంధనల ప్రకారం కలిసే అవకాశం కల్పించాలని కూడా కోర్టు ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..

Advertisement

ఇకపోతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కేసు విషయంలో వస్తున్న వార్తల విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై పూర్తి అధికారిక ప్రకటన రావాలి అంటే ఎవరో ఒకరు అధికారికంగా స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే.

జయం రవి, ఆర్తి ప్రేమ, పెళ్లి..

సినీ నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తెను 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వివాహం జరిగిన 15 ఏళ్ల తర్వాత 2024లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Related News

“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

షూటింగ్లో గాయపడ్డ జూ.ఎన్టీఆర్.. స్పందిస్తున్న సెలబ్రిటీస్!

ఫ్యాన్స్ మీట్ లో అల్లు అర్జున్.. ట్రోల్స్ వద్దు బ్రదర్!

ఆడాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు.. వీడియోతో వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’!

పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత మొత్తం ‘మా’దే -కరాటే కళ్యాణి

పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య!

Big Stories

Advertisement
×