Epic First Semester Review:ఎపిక్ ..ఫస్ట్ సెమిస్టర్ …సితార ఎంటర్టైన్మెంట్ పై ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన ఈ సినిమా నిన్ననే థియేటర్లోకి వచ్చిన సంగతి తెల్సిందే.ఒక వైపు ’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ డైరెక్టర్ కావడం,మరొక వైపు బేబీ లో నటించిన జోడీ అవడం, ఇంకో వైపు ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై రావడం ..వెరసి సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఆడియన్స్.
కానీ ఈ సినిమా అన్నదానికి భిన్నంగా మొదటి రోజే డివైడ్ టాక్ మూటగట్టుకోవడం గమనార్హం.నిజానికి డైరెక్టర్ ఆదిత్య హాసన్ నుండి ’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ లాగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఆశించారు చాలా మంది.కానీ సినిమాలో లివింగ్ రిలేషన్‌షిప్స్, శారీరక సంబంధాలు,పర్సనల్ ఫ్రీడమ్ అంటూ మరో కథని తెరమీద చెప్పడంతోనే మెజారిటీ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు.
ట్రైలర్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైంది అనిపించినప్పటికీ సినిమా వాటన్నింటిని జస్టిఫై చేస్తుంది అంటూ ఆదిత్య హాసన్ స్టేజీలపై ఊదరగొట్టడంతో పొలోమంటూ పరిగెత్తారు ఆడియన్స్.కానీ ఆబ్బె అనుకున్నంత సీన్ సినిమాకి లేదంటూ ఫస్ట్ షో కె తేల్చేశారు.
ఫస్ట్ డే కంప్లీట్ అయ్యే సరికి బ్లాక్ బస్టర్ టాక్ దేవుడెరుగు.కనీసం ఇట్స ఒకే అన్న రేంజ్ లో కూడా టాక్ రాకపోవడంతో షాక్ కి గురయ్యారు మేకర్స్ .అసలు ఎక్కడ గురి తప్పిందా అంటూ ఇపుడు లెక్కలు వేసే పనిలో పడ్డారని వినిపిస్తుంది.ఇక ప్రస్తుతం థియేటర్లలో సినిమా నడుస్తున్న వాలకం చూస్తుంటే ఈ వారం అయినా బాక్సాఫీస్ వద్ద సినిమా నిలబడుతుందా అంటూ చర్చలు పెట్టేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
మరోవైపు సినిమాలో కామెడీ టోటల్ మిస్ అయిందన్న టాక్ వినిపిస్తుంది.సినిమా అక్కడక్కడా కాస్త ట్రాక్ తప్పినా కామెడీ ఉంటే వాటిని కవర్ చేసేదని కానీ సినిమా ఇపుడు మిస్ ఫైర్ అయిందని తేల్చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక పోనీ ఎంటర్ టైన్ మెంట్ లేకపోయినా ఎమోషన్ అయినా పేలిందా అంటే అదీ అంతంత మాత్రమే కావడం సినిమాకి మెయిన్ డ్రా బ్యాక్ . ముఖ్యంగా సెకండాఫ్ లో మెయిన్ రోల్స్ మధ్య వచ్చే సాగదీత డైలాగ్స్ ఆడియన్స్ ని ఏ మాత్రం ఎంగేజ్ చేయలేకపోయామని ,’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’లో నటించిన పేరెంట్స్ శివాజీ ,వాసుకి ల రోల్స్ అసలే మాత్రం కనెక్ట్ కాలేదన్న టాక్ వినిపిస్తుంది.ఇక వీరిద్దరూ ’90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’కి ఎంత ఎసెట్ గా నిలిచారో చెప్పక్కర్లేదు.
ముఖ్యంగా..సినిమాలో చూసిన సీన్లే మళ్ళీ మళ్ళీ చూసినట్టుగా ఉండటం మూలానా ఆడియన్స్ కి బోర్ కొట్టిందన్న ఫీడ్ బ్యాక్ వినిపిస్తుంది.ఇక సినిమాలో కామెడీ లేదని నాగ వంశీనే ఒప్పుకున్నాడు .ఆదిత్య హాసన్ తన యూకే లైఫ్ ని జెన్యూన్ గా తెరకెక్కించాడని ,కామెడీ అందుకే వాంటెడ్ గా యాడ్ చేయలేదని చెప్పుకొచ్చారు.కానీ సినిమా ఎంత రియల్ స్టోరీ అయినా ఇలాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తీసినప్పుడు సినిమాటిక్ కామెడీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని మర్చిపోయినట్టున్నారు పాపం.
మరిన్ని రోజులు గడిస్తే ఏమైనా టాక్ మారుతుందో !
ఇక సినిమాకి సీక్వెల్ అయిన ఫైనల్ సెమిస్టర్ కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తుందని మేకర్స్ రిలీజ్ కి ముందు అనౌన్స్ చేశారు.కానీ సినిమాకి వస్తున్న టాక్ ,మేకర్స్ సాలిడ్ గా పక్కా గా వస్తాం అని చెప్పని తీరు చూస్తుంటే ఎన్నో ఆగిపోయిన సీక్వెల్ లిస్ట్ లో ఇదికూడా చేరేలానే ఉంది.చూడాలి మరిన్ని రోజులు గడిస్తే ఏమైనా టాక్ మారుతుందో !