Raviteja: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎటువంటి ఫ్యాన్ బేస్ కి లొంగకుండా ఫ్యాన్ వార్స్ కి అతీతంగా ఉండే హీరోలు కొంతమంది ఉన్నారు. వారిలో విక్టరీ వెంకటేష్ రవితేజ వంటి హీరోల పేర్లు మనకు వినిపిస్తూ ఉంటాయి. రవితేజ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన రవితేజ, ఆ తర్వాత కాలంలో నటుడుగా కూడా అడుగులు వేశాడు. రవితేజ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణంలో రవితేజ అని పెట్టి హీరోగా సినిమా చేస్తాను అని పూరి జగన్నాథ్ చాలా సందర్భాల్లో అన్నాడు. ఆ విషయాన్ని రవితేజ సీరియస్ గా తీసుకోలేదు. కానీ పూరి నిజంగా రవితేజతో సినిమా చేసి అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం రవితేజ తన కెరీర్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఓకే చేసిన రవితేజ
నిన్ను కోరి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శివ నిర్వాణ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య సమంత కలిసి నటించిన మజిలీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక్కడితో శివ నిర్వాణ కూడా టాప్ డైరెక్టర్ అయిపోయాడు. మళ్లీ నాని హీరోగా చేసిన టక్ జగదీష్ సినిమా డైరెక్టర్ ఓటిటిలోకి విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి సినిమా కూడా ఊహించని సక్సెస్ ఇవ్వలేదు. ఒక ప్రస్తుతం హీరో రవితేజకు శివ నిర్వాణ ఒక అద్భుతమైన కథను చెప్పారు. ఈ కథ కూడా రవితేజకు విపరీతంగా నచ్చిందట. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారి ప్రకటన రానుంది.
వరుస డిజాస్టర్ సినిమాలు
రవితేజ విషయానికి వస్తే ధమాకా సినిమా తర్వాత ఇప్పటివరకు అదిరిపోయిన హిట్ సినిమా తన కెరీర్ కి పడలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ తన 75వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలపనుంది చిత్ర యూనిట్.
Also Read : Sanjay Dutt on Prabhas: ప్రభాస్ నన్ను బాగా తినిపించాడు, ప్రభాస్ పై సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు