Standup India: కేంద్ర ప్రభుత్వం మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. సొంత బిజినెస్ చేసుకోవాలనుకునే వారికి స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు రూ.2 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. .
2016 లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టాండప్ ఇండియా స్కీమ్ మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వారికి స్వయం ఉపాధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరగతి కుటుంబాలను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది కొత్త మార్గదర్శకాలతో.. ఈ పథకాన్ని ప్రజలకు మరింత సులభతరం చేశారు.
ఈ స్కీంకు అప్లై చేసుకునేందుకు ఆధాకర్ కార్డు కేవైసీ తప్పకుండా చేయించుకుని ఉండాలి. 18 ఏళ్ల వయస్సు దాటి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. బిజినెస్ ప్లాన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్టాండప్ ఇండియా స్కీం ద్వారా రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ పొందవచ్చును. మొదటి దశలో చిన్న వ్యాపారం చేసుకునే వారికి రూ.2లక్షల నుంచి రూ.40లక్షల వరకు పొందవచ్చు. లోన్ లో 75 శాతం బ్యాంకు నిధులు, మరో 25 శాతం స్వీయ పెట్టుబడి గా ఉంటుంది. బ్యూటీ పార్లర్, బౌటిక్, ఫుడ్ ప్రాసెసింగ్, బేకరీ, డిజిటల్ సర్వీసెస్, ఆటో మొబైల్ సర్వీసెస్, కన్సల్టెన్సీ సంస్థల లాంటి బిజినెస్ లు చేసుకోవచ్చు.
మొత్తం ఈ స్కీ ద్వారా రూ.2లక్షల నుంచి రూ. కోటి వరకు లోన్ పొందవచ్చు. దీనికి అత్యల్ప వడ్డీ ఉంటుంది. లోన్ తిరిగి చెల్లించే సమయం ఏడేళ్ల కాలవ్యవధి ఉంటుంది.
ALSO READ: Rain News: ఈ ప్రాంతానికి రేపు భారీ వర్షం.. ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన
ఎలా అప్లై చేసుకోవాలంటే..: ముందుగా స్టాండప్ మిత్ర వెబ్ సైట్ లోకి వెళ్లాలి. www.standupmitra.in లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ నంబర్, కాంటాక్ట్ నంబర్, బిజినెస్ ప్లాన్, బ్యాంక్ వివరాలు అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆరు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్, అడ్రస్ ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది.
ALSO READ: Airport Jobs: బంపర్ ఆఫర్ భయ్యా.. పదితో 1446 ఉద్యోగాలు, ఒక్కసారి అప్లై చేసి చూడండి..
స్టాండప్ ఇండియా స్కీం మహిళలకు ఒక అద్భుతమైన అవకాశం. బిజినెస్ చేయాలనకునే మహిళలకు ఈ స్కీం ప్రోత్సహిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ స్కీంకు అప్లై చేసుకోండి. సులభంగా లోన్ పొందండి.