E-Paper
Advertisement

ప్రియుడు బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!

ప్రియుడు బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!
Advertisement

Priyanka Jain:బుల్లితెర ఇండస్ట్రీలో ‘శివప్రియ’ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న క్యూట్ జోడి ప్రియాంక జైన్ (Priyanka Jain), శివకుమార్ (Shiva Kumar) అలియాస్ శివ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ లవ్లీ జంట పెళ్లి చేసుకోకుండానే ఒకవైపు తమ కలల సౌధాన్ని నిర్మించుకుంటూ.. మరొకవైపు లివింగ్ రిలేషన్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే వీళ్ళిద్దరూ తెలుగు, కన్నడ టెలివిజన్ సిరీస్ లలో, రియాలిటీ షోలలో, డిజిటల్ కంటెంట్ లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన శివ్..

ఇక 2026 ప్రారంభంలో జియో హాట్ స్టార్ , స్టార్ మా వేదికలుగా ప్రసారమైన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే తెలుగు సిరీస్ లో కూడా వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారు. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో కూడా జంటగా సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక జైన్ ఇదివరకే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు శివ్ వంతు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా తొలి వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా అడుగుపెట్టారు శివ్. ఇకపోతేశివ్ హౌస్ లోకి అడుగు పెట్టడంతో ప్రియాంక జైన్ ఏం చేస్తోంది అంటూ అభిమానులు సైతం ఆరా తీయగా.. సడన్గా ఆమె తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏఐతో సృష్టించబడిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.అది చూడగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ప్రియాంక జైన్ సన్యాసం పుచ్చుకుందా ?అంటూ కామెంట్ చేస్తున్నారు.

సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక జైన్..

Advertisement

మరికొంతమంది తన ప్రియుడు శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు కదా.. అందుకే ఆమె ఈ సన్యాసం పుచ్చుకుందేమో అంటూ కామెంట్లు చేయడం గమనార్హం. ఇకపోతే తాజాగా ప్రియాంక జైన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా.. బ్రహ్మచారిని గెటప్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. “జై మాతా జీ.. మమ్మల్ని రక్షించు తల్లి” అంటూ క్యాప్షన్ జోడించింది. ఇకపోతే దేవి నవరాత్రుల్లో భాగంగా ప్రియాంక ఈ గెటప్ లో దర్శనమిచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరిగ్గా ఈమె ప్రియుడు శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం.. ఇటు దేవీ నవరాత్రులు రావడం.. ఇంతలో ఆమె ఇలా బ్రహ్మచారిని గెటప్ లో కనిపించడం అన్నీ వైరల్ గా మారుతున్నాయి.

also read: బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు
నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..

ఇకపోతే బ్రహ్మచారిని గెటప్లో ఉన్న ప్రియాంక జైన్ ని చూసి నేటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకరేమో పండుగలు వస్తే చాలురా నాయనా అంటూ లాల్ ఎమోజీలను షేర్ చేస్తుంటే.. మరి కొంతమంది నా జాతకం చూడవా ప్లీజ్ మేడం అంటూ కామెంట్ చేశారు.. ఇంకొంతమంది ఒక్క దేవి మాత్రమే ఇంత అందంగా ఉంది ఇంకా ఎనిమిది మంది రాబోతున్నారు అంటూ అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Advertisement

Related News

జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?

హీటెక్కిన నామినేషన్.. మళ్లీ నోరు జారిన రోహిత్..ఈ వారం?

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×