Star Kid:కథ నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడైనా.. ఎంత పెద్ద నిర్మాత అయినా సరే రిజెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది హీరోలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఓ స్టార్ కిడ్ కూడా కథ నచ్చకపోవడంతో ఏకంగా 50 కథలను రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారట. అంతే కాదు చాలామంది స్టార్ నిర్మాతలు కూడా ఆయనకు అడ్వాన్సులు ఇచ్చారట. కానీ కథ నచ్చకపోవడంతో అన్ని సినిమాలు రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి 50 కథలను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ కిడ్ ఎవరు? ఎందుకు అన్ని కథలు రిజెక్ట్ చేశారు? అసలు సినిమా కథ నచ్చలేదా? లేక సినిమా చేసే ఉద్దేశమే లేదా? అనే కోణంలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నాలుగేళ్లయిన సినిమా విడుదల చేయని శ్రీకాంత్ కొడుకు..
ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Srikanth) తనయుడు రోషన్ (Roshan).. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో తన యాక్టింగ్ తో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఈ మూవీతో శ్రీలీల కూడా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ సినిమాలో రోషన్ కంటే శ్రీలీల యాక్టింగ్ డామినేటింగ్ గా అనిపించిందని చాలామంది మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి సందD (Pelli Sandadi) సినిమా కంటే ముందే ‘నిర్మలా కాన్వెంట్’ (Nirmala Convent) అనే మూవీలో చేశారు. ఈ సినిమాలోని నటనకి గానూ.. సైమా అవార్డ్స్ లో ఉత్తమ తొలిచిత్ర నటుడి అవార్డు కూడా అందుకున్నారు రోషన్. ఇక రోషన్ నటించిన పెళ్లి సందD సినిమా వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ రోషన్ మరో సినిమాని విడుదల చేయలేదు. ఆయనతోపాటు నటించిన శ్రీలీల (Sreeleela) వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారింది. కానీ రోషన్ మాత్రం వెనకబడ్డారు.
50 కథలు రిజెక్ట్ చేసిన రోషన్..
అయితే ప్రస్తుతం రోషన్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఛాంపియన్ (Champion) అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందట. అయితే పెళ్లి సందD సినిమా వచ్చి ఇన్నేళ్లయినా కూడా రోషన్ మరో సినిమా విడుదల చేయకపోవడంతో ఈయన ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారని అందరూ అనుకున్నారు. కానీ ఈ గ్యాప్ లో రోషన్, శ్రీకాంత్ (Srikanth)దాదాపు 50 కథల వరకు విన్నారట. అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా నచ్చకపోవడంతో వాటన్నింటిని రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం ఛాంపియన్ సినిమా విడుదలయ్యాక నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే రోషన్ కి నాగ వంశీ(Naga Vamsi), సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda), ఏషియన్ సునీల్(Asian Sunil) వంటి స్టార్ నిర్మాతలు కూడా అడ్వాన్సులు చెల్లించారట. మరి ఈ నిర్మాతలందరిలో నెక్స్ట్ రోషన్ ఎవరి సినిమాలో చేయబోతున్నారో తెలియాల్సి ఉంది. ఇక ఛాంపియన్ మూవీకి ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitham) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్(Anandi Arts Creations), జీ స్టూడియోస్(Zee Studios) , స్వప్న సినిమాస్ (Swapna Cinemas) సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
రౌడీ హీరో మాటలను నిజం చేసిన రోషన్..
ఇదిలా ఉండగా మరోవైపు రోషన్ 50 కథలను రిజెక్ట్ చేశారనే వార్త మీడియాలో వైరల్ అవ్వడంతో.. చాలామంది నెటిజన్లు ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) అన్నట్లు నెపోకిడ్స్ కి మొహం మీదే ఎన్ని కథలైనా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుందనే మాటలకు శ్రీకాంత్ కొడుకు రోషన్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ:HHVM: మెగా ఫ్యామిలీ దూరంగా ఉండడానికి కారణం అదేనా?