E-Paper
Advertisement

తెలంగాణకు పీఎం సహకరించడం లేదు.. డెవలప్‌మెంట్ ఫైళ్లన్నీ ఆపేస్తున్నారు: సీఎం రేవంత్

తెలంగాణకు పీఎం సహకరించడం లేదు.. డెవలప్‌మెంట్ ఫైళ్లన్నీ ఆపేస్తున్నారు: సీఎం రేవంత్
Advertisement

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ అభివృద్ధికి పీఎం మోడీ సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు సార్లు ప్రజలను మోసం చేసిన మోడీ..నాలుగోసారి పవర్ లోకి రావాలంటే కచ్చితంగా ప్రజలు మనస్సు గెలుచుకోవాల్సిందేనని, బురిడి కొట్టించి అధికారంలోకి పొందాలంటే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఢిల్లీ వేదికగా జరిగిన ‘ది కాంక్లేవ్ 2026– ఇండియా నెక్ట్స్ చాప్టర్ ’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలు, దక్షిణ రాష్ట్రాల పట్ల చూపిస్తున్న పక్షపాతం, ఎన్నికల కమిషన్ దుర్వినియోగం ,తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఎం నిప్పులు చెరిగారు. ‘నాడు స్వాతంత్ర్య పోరాటంలో ‘సైమన్ గో బ్యాక్’ అన్నట్లే..రానున్న రోజుల్లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ‘సార్ గో బ్యాక్’ అని నినదించాల్సిన సమయం వచ్చింది’ అని  సీఎం పిలుపునిచ్చారు.

అభివృద్ధి ఫైళ్లను కేంద్రం అడ్డుకుంటోంది..

Advertisement

ఉమ్మడి గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతో హుందాతనంతో వ్యవహరించి ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో సహకరించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోదీ.. మన్మోహన్ సింగ్ ఇచ్చిన సహాయంలో 10 శాతం కూడా తెలంగాణకు అందించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించిన మెట్రో రైల్ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు ,జాతీయ రహదారుల విస్తరణ ఫైళ్లను ఆపేస్తున్నారన్నారు. 360 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి రెండేళ్లవుతున్నా పీఎంఓలో ఫైలు పెండింగ్‌లోనే ఉంచారని సీఎం స్పష్టం చేశారు. ఇది ‘నార్త్ వర్సెస్ సౌత్’ వివాదం కాదని,  గుజరాత్ వర్సెస్ దేశం అన్నట్లుగా పరిస్థితి మారిందని సీఎం  వివరించారు. మోదీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, సెమీకండక్టర్ ప్రాజెక్టులు మొదలుకొని సకల పరిశ్రమలు, నిధులను గుజరాత్‌కే తరలించుకుపోతున్నారని సీఎం ఆరోపించారు.

డీలిమిటేషన్‌తో చిన్న రాష్ట్రాలకు ముప్పు.. 25 ఏళ్లు ఫ్రీజ్ చేయాలి

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చిన్న రాష్ట్రాలను, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని దారుణంగా దెబ్బతీస్తుందని సీఎం హెచ్చరించారు. 1976లో ఇందిరా గాంధీ  దేశంలో లోక్‌సభ సీట్లను 543 వద్ద ఫ్రీజ్ చేశారని, కేంద్ర పిలుపు మేరకు దక్షిణ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి జనాభాను నియంత్రించాయని సీఎం స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఉదాహరణకు కేరళలో 20 సీట్లు, యూపీలో 80 సీట్లు ఉంటే.. 50 శాతం సీట్లు పెంచితే కేరళకు 30, యూపీకి 120 అవుతాయని సీఎం వెల్లడించారు. దీంతో వ్యత్యాసం 60 నుంచి 90కి పెరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 1976లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత వాజ్‌పేయీ చేసినట్లే.. 2026లో కూడా మోదీ మరో 25 ఏళ్ల పాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను యథాతథంగా ఫ్రీజ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు.

ఎస్ ఐ ఆర్ పేరుతో ఓట్ల తొలగింపు..

బ్రిటిషర్లు తెచ్చిన సైమన్ కమిషన్ తరహాలోనే ప్రస్తుతం నరేంద్ర మోదీ ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.2014లో 81 కోట్లు, 2019లో 91 కోట్లు, 2024లో 97 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య పెరగాల్సింది పోయి.. 2029 నాటికి దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించేందుకు “ఎస్ ఐ ఆర్’ ప్రక్రియ పేరుతో మోడీ కుట్ర పన్నుతున్నారని సీఎం ఆరోపించారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెట్టే వారిని గుర్తించి, ఏఐ సాంకేతికతతో వారి ఓట్లను తొలగిస్తున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ , కలెక్టర్లకు ఉన్న అధికారాలను గుంజుకుని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ చేతిలో పెట్టారని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని అన్నారు.

బీజేపీ రాముడి పేరుతో రాజకీయం..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తరహా పాలనకు ఇది దారితీస్తుందని సీఎం హెచ్చరించారు. తాము పేదల వైపు ఉంటే.. బీజేపీ సంపన్నుల వైపు ఉన్నదన్నారు. శివుడు పేదల దేవుడైతే, బీజేపీ రాముడి పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. అల్పసంఖ్యాకులను, వ్యతిరేకించే వారిని అణిచివేస్తే విప్లవం తప్పక వస్తుందని సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ వంటి నాయకులంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణ కోసం ‘సార్  గో బ్యాక్’ ఉద్యమాన్ని నడిపిస్తారు” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

విద్యకే తొలి ప్రాధాన్యం..

తెలంగాణలో రాజ్యాంగబద్ధమైన అభివృద్ధి, సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగానికి పునాదులు వేశారని, నాగార్జునసాగర్, భాక్రా నంగల్, ఐఐటీలు, ఐఐఎంలు నిర్మించారి సీఎం వివరించారు. ఆ బాటలోనే తమ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను చక్కదిద్దుతున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నామని చెప్పారు. ప్రతీ ఏటా రాష్ట్రంలో 1.80 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నా, నైపుణ్యాల లేమి వల్ల కేవలం 20 వేల మందికే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. అందుకే ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని, ఐఐటీలను అడ్వాన్స్ డ్ టెక్నాటజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి టాటా గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామని సీఎం వివరించారు.

జర్మన్, జపనీస్, కొరియన్ భాషలలో శిక్షణ

భవిష్యత్తులో బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి జర్మన్, జపనీస్, కొరియన్ భాషలలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో స‌గ‌టున 30 మంది విద్యార్థుల‌కు 1 టీచ‌ర్ ఉంటే, తెలంగాణ‌లో 17 మంది విద్యార్థుల‌కు ఒక టీచ‌ర్ ఉన్నారని సీఎం వివరించారు. తాము దేశ స‌గ‌టు క‌న్నా మిన్న‌గా ఉన్నామన్నారు. అయినా ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వ పాఠ‌శాలల నుంచి 50 నుంచి 60 వేల మంది ప‌క్క‌కు వెళుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం ఇంగ్లీష్ మీడియం అనే విషయాన్ని గుర్తించామన్నారు. ఈ నేపథ్​యంలోనే ప్రభుత్వ స్కూళ్లలో న‌ర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు భాష‌, నైపుణ్యాలు నేర్పుతున్నామన్నారు.

విద్యార్థి రాజకీయం నుంచి సీఎంగా నా ప్రయాణం..

సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. 2006లో జెడ్పీటీసీగా, 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ అభ్యర్థులనే ఓడించానని  తెలిపారు. అనంతరం ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడేందుకు టీడీపీలో చేరి 2009, 2014లలో ఎమ్మెల్యేగా గెలిచానని సీఎం వివరించారు.రాష్ట్ర విభజన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాలు, కేసీఆర్ నియంతృత్వ పాలనను ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో 2017లో కాంగ్రెస్‌లో చేరానని చెప్పారు. “కాంగ్రెస్‌లో చేరితే రాజకీయం ఉండదన్న వ్యాఖ్యలను పటాపంచలు చేస్తూ పార్టీ నాకు కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు , ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులను ఇచ్చి గౌరవించిందని సీఎం స్పష్టం చేశారు.వాస్తవానికి రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత  కేసీఆర్‌, రేవంత్ మ‌ధ్య పోటీగా మారిందని వివరించారు. ఆయ‌న తనను అనేక సార్లు జైలుకు పంపారన్నారు.తాను అసెంబ్లీకి క‌న్నా జైలుకే ఎక్కువ సార్లు పోయానని సీఎం వివరించారు.

Also Read: మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని 100 గొర్రెలు మృతి!

Tags

Related News

పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు శ్రీరాముడు, హర హర మహాదేవ్ ఎందుకనరు-సీఎం రేవంత్

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని సుమారు 250 గొర్రెలు మృతి!

ఫార్ములా-ఈ కేసులో బిగ్ అప్‌డేట్.. కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్!

లారీని ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 40 మంది, ఖమ్మం జిల్లాలో ఘటన

కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

Big Stories

Advertisement
×