Nothing Headphone 1 Pro: టెక్ వరల్డ్‌లో తనదైన యూనిక్యూ డిజైన్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘నథింగ్’ సంస్థ తాజాగా ఆడియో లవర్స్ కోసం అదిరిపోయే గాడ్జెట్ లాంచ్ చేసింది! అదే Nothing Headphone (1) Pro. ట్రిపుల్ డ్రైవర్ సెటప్, అదిరిపోయే 46dB యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ , ఏకంగా 68 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది. కేవలం లుక్స్‌లోనే కాకుండా.. క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీతో మ్యూజిక్ లవర్స్‌ను.. ఈ ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్ ఫోన్ ఫిదా చేస్తోంది. లేటెస్ట్ ఫీచర్లతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ కొత్త హెడ్ ఫోన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హెడ్‌ఫోన్ మెయిన్ హైలైట్ దీని ట్రిపుల్ డ్రైవర్ ఆర్కిటెక్చర్. ఇందులో ఉన్న మూడు డ్రైవర్లు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను అద్భుతంగా.. హ్యాండిల్ చేస్తూ, క్రిస్టల్ క్లియర్ ఆడియోను అందిస్తాయి. డీప్ బేస్, స్పష్ట మైన వోకల్స్ , రిచ్ ఇన్‌స్ట్రుమెంట్స్ సౌండ్‌ను .. ఇవి విడదీసి మరీ అద్భుతంగా ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే.. ప్రసిద్ధ మెట్రోపాలిస్ స్టూడియోస్ సహకారంతో దీనికి సౌండ్ ట్యూనింగ్ చేయడం విశేషం. దీని వల్ల ప్రతి సాంగ్‌లోనూ స్టూడియో.. లెవెల్ మ్యూజిక్ ఫీలింగ్‌ను యూజర్లు నేరుగా ఆస్వాదించవచ్చు.
బయటి ప్రపంచంలోని.. శబ్దాలు మ్యూజిక్‌కు అడ్డు రాకుండా.. ఉండేందుకు ఇందులో పవర్ ఫుల్ 46dB అడాప్టివ్ ANC ఫీచర్‌ను వాగారు. మొత్తం 10 మైక్రో ఫోన్ల సిస్టమ్‌తో.. కూడిన.. ఈ టెక్నాలజీ పరిసరాల్లోని.. బయటి శబ్దాలను క్షణాల్లో తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనిలో.. విండ్ ప్రూఫ్, క్లియర్ వాయిస్ టెక్నాలజీ ఉండటం వల్ల ప్రయాణాల్లో లేదా ఆఫీసుల్లో కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్పష్టమైన ఆడియో వస్తుంది.
బ్యాటరీ బ్యాకప్ విషయంలో నథింగ్ హెడ్‌ఫోన్ ప్రో అదరగొట్టింది. దీనిలోని పెద్ద 1060mAh బ్యాటరీ సహాయంతో..ANC ఆఫ్‌లో ఉంటే ఏకంగా 68 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. ANC ఆన్‌లో ఉంటే దాదాపు 30 గంటల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. అంతేకాకుండా.. అత్యవసర సమయాల్లో కేవలం 5 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు, గంటల కొద్దీ మ్యూజిక్ వినేలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
నథింగ్ ప్రొడక్ట్స్ ప్రత్యేకత అయిన ట్రాన్స్‌పరెంట్ డిజైన్.. ఎలిమెంట్స్‌తో పాటు, మెషిన్డ్ మెటల్, అల్యూమినియం , టైటానియం అలాయ్ ఆర్మ్స్‌ను ఇందులో వాడారు. ఇది కేవలం 327 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఇయర్ కుషన్స్ చాలా సాఫ్ట్‌గా ఉండటంతో పాటు.. ఎక్కువ సేపు పెట్టుకున్నా చెవులకు ఎలాంటి నొప్పి కలగకుండా డిజైన్ చేశారు. Hi-Res ఆడియో సర్టిఫికేషన్, LDAC కోడెక్ సపోర్ట్ దీని విలువను మరింత పెంచుతున్నాయి.
ధర:
ఫీచర్స్ పరంగా హై-ఎండ్‌లో ఉన్న ఈ హెడ్‌ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు $399 (మన దేశ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 38,300) ధర వద్ద లాంచ్ అయింది. బ్లాక్ , వైట్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. మన దేశంలో దీని అధికారిక సేల్ , ఖచ్చితమైన ధర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ లైఫ్, అదిరిపోయే సౌండ్ కోరుకునే టెక్ లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.