BigTV English

ViswakSen : ఫిలింనగర్ లో వావన్ జ్యువెలరీని ప్రారంభించిన హీరో విశ్వక్ సేన్..

ViswakSen : ఫిలింనగర్ లో వావన్ జ్యువెలరీని ప్రారంభించిన హీరో విశ్వక్ సేన్..

ViswakSen : టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఈమధ్య వరస సినిమాలు చేస్తున్న బిజీగా గడుపుతున్న విశ్వక్ పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ వస్తున్నాడు. ఈమధ్య వరుసగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లలో కూడా విశ్వక్ సేన్ కన్పిస్తున్నాడు. తాజాగా ఫిలింనగర్ లోని ప్రముఖ జువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో విశ్వక్ సేన్ సందడి చేశారు.. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


వావన్ జ్యువెలరీ ప్రారంభం.. 

హీరో విశ్వక్ సేన్ సోదరి వన్మయి తన వావన్ జ్యువెలరీ షోరూంను ఫిల్మ్ నగర్ లో ప్రారంభించారు. సోమవారం నాడు జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ తో కలిసి ఈ షో రూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా కె.వి. అనుదీప్, విశ్వక్ సేన్ లు మాట్లాడుతూ ట్రెండ్ కు అనుగుణంగా వస్తున్న ఆభరణాలు నిత్యం కొత్తే అన్నారు. జ్యూవెలరీ డిజైనర్ వన్మయి డిజైన్ చేసిన జ్యూవెలరీ ప్రత్యేకంగా ఉన్నాయని అన్నారు.. ఇక ఎమరాల్డ్స్ , రూబీలు, డైమండ్‌లతో రూపొందించిన ఆకర్షణీయమైన జ్యూవెలరీ కలెక్షన్లు వావన్ ప్రత్యేకత అని వివరించారు.. ఈ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Also Read : భాగ్యం ప్లాన్ సక్సెస్.. నర్మదకు స్ట్రాంగ్ వార్నింగ్.. శ్రీవల్లి మళ్లీ సేఫేనా..?

విశ్వక్ సేన్ సినిమాలు.. 

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది లైలా చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు… ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న విశ్వక్.. ఈ ఏడాది మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచారు. ఈ హీరో హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన 2017లో ‘వెళ్లిపోమాకే’ చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దాని తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’తో హీరోగానే కాకుండా డైరెక్టర్‌, రైటర్, కో పొడ్యూసర్‌గానూ మారాడు… ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలను చేశారు. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిల్వలేదు.. విశ్వక్‌సేన్ ప్రస్తుతం ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌తో ‘ఫంకీ’ అనే మూవీ లో నటిస్తున్నాడు. దీన్ని ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రేమ, వినోదంతో కూడిన ఓ కుటుంబ కథతో ఈ సినిమా రాబోతుందని టాక్.. మరి ఇదైనా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.. ఈ మూవీ హిట్ అయితేనే విశ్వక్ కెరీర్ ట్రాక్ లో పడుతుందని సినీ వర్గాల్లో అభిప్రాయపడుతున్నారు.

Related News

Nandamuri:నందమూరి ఇంట విషాదం… జయకృష్ణ భార్య కన్నుమూత

90’s A Middle Class: అవార్డుల పంట పండించిన శివాజీ 90’స్.. సంతోషంలో టీమ్!

Manushi Chillar: సెలైన్ బాటిల్ తో కనిపించిన మానుషీ చిల్లర్.. ఏమైందంటూ ఫాన్స్ ఆందోళన!

Star Hero: ఆ స్టార్ హీరో మూవీ సెట్ లో 120 మందికి అస్వస్థత!

Bollywood: 3 ఇడియట్స్ నటుడు కన్నుమూత.. కారణం ఏంటంటే?

Big Stories

×