BigTV English

IRCTC package: IRCTC ది బెస్ట్ ప్యాకేజ్.. లైఫ్‌లో ఒక్కసారైనా.. ట్రిప్ వెళ్లాల్సిన ప్లేస్ ఇదే!

IRCTC package: IRCTC ది బెస్ట్ ప్యాకేజ్.. లైఫ్‌లో ఒక్కసారైనా.. ట్రిప్ వెళ్లాల్సిన ప్లేస్ ఇదే!

IRCTC package: ఇంట్లో, ఆఫీసులో, ట్రాఫిక్‌లో.. ఆ రోజువారీ రొటీన్‌కి కాస్త బ్రేక్ ఇవ్వాలని అనుకున్నారు కదా.. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. మాటలతో కాదు.. ఊహించని రీతిలో IRCTC తీసుకొచ్చిన ఒక సూపర్ కూల్ ప్యాకేజ్ మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకువెళ్లడం ఖాయం. ప్రకృతిలో మునిగిపోయేలా, కొండల మజిలీ, భూమిపై స్వర్గాన్ని అనుభవించేలా చేసే ఈ ట్రిప్.. లైఫ్‌లో ఒకసారి అయినా వెళ్లాల్సిందే అనిపించేలా ఉంది. ఇంకా బుకింగ్ చేయలేదా? మిస్ అయితే మళ్ళీ అప్పుడప్పుడే కాదు. ఇంతకు ఈ టూరేంటి, ఎక్కడకి, ఎంతకి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


ఒకవైపు వెచ్చని కాఫీ, మరోవైపు పచ్చని కొండలు.. మధ్యలో మీరు. ఇలాంటి సీన్‌ను మనం జస్ట్ ఎక్కడో సోషల్ మీడియాలలో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నిజంగా ఆ ఫీల్ మీరు పొందే ఒక పక్కా ఛాన్స్ వచ్చింది. IRCTC నుంచి వచ్చేసిన కొత్త ప్యాకేజీ.. అదే కేరళ లష్ గ్రీన్ హిల్స్ (Kerala Lush Green Hills (SEH048) ట్రిప్. మీరు ఒక్కసారైనా చూడాల్సిన ట్రిప్ అంటే ఇదే.

ఇది 3 నైట్లు, 4 రోజులు జరగనున్న ప్యాకేజ్. మొత్తం ప్రయాణం కొచ్చి నుంచి మొదలై, Munnar, Thekkady, Kumarakom, Alleppey వంటి కేరళ బ్యూటీఫుల్ లొకేషన్ల మీదుగా సాగుతుంది. ఒక పక్క వెతల్ని దూరం చేసే గ్రీన్ హిల్స్, మరోవైపు బోట్ హౌస్‌ల్లో సైలెంట్ వెన్నెల రాత్రులు.. ఇలా ఓ ట్రిప్‌లో అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉండేలా ప్లాన్ చేశారు.


బుకింగ్ డేట్లు ఎలా ఉన్నాయి?
ఈ ప్యాకేజీకి బుకింగ్‌ మొత్తం రోజూ చేయవచ్చు. అంటే మీకు ఎప్పుడైనా సమయం దొరికితే, ఏ తారీఖునైనా వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, 06 ఆగస్టు 2025 నుంచి టూర్‌ ప్రారంభమవుతోంది. దానికంటే ముందు బుకింగ్ చేసుకుంటే మీకు ఫస్ట్ బ్యాచ్‌లో ఛాన్స్ దొరుకుతుంది.

Also Read: Metro Card Ban: మెట్రో పాత కార్డులకు గుడ్‌బై.. కొత్త రూల్ మీకు తెలుసా!

ధరలు ఎలా ఉన్నాయంటే?
ధరల విషయానికొస్తే, IRCTC చాలా సింపుల్‌గా, క్లియర్‌గా కేటగిరీలను విభజించింది. 2025 జూన్ 30 వరకు బుక్ చేస్తే, కొంచెం తక్కువ ధర. జూలై 1 నుండి సెప్టెంబర్ 23 మధ్య బుక్ చేస్తే, కొద్దిగా వృద్ధి. కానీ ఎక్కువ తేడా లేదు.
సింగిల్ అక్యుపెన్సీ: రూ. 35,230 నుంచి రూ. 35,725 వరకు
డబుల్ అక్యుపెన్సీ: రూ. 18,145 నుంచి రూ. 18,390
ట్రిపుల్ అక్యుపెన్సీ: రూ. 14,005 నుంచి రూ. 14,205
చిన్న పిల్లలకీ (బెడ్‌తో 5-11 ఏళ్లు): రూ. 6,145
చిన్న పిల్లలకీ (బెడ్ లేకుండా): రూ. 3,070
మీరు ఒక ఫ్యామిలీగా వెళ్లాలన్నా, కపుల్‌గా వెళ్లాలన్నా, ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌గా ప్లాన్ చేయాలన్నా.. అన్ని రకాల ఆప్షన్స్‌ను కలిపేలా ఇది ఒక బ్యూటీఫుల్ ప్యాకేజీ.

ప్రయాణంలో ఏముంటుంది?
ఈ టూర్‌లో మీరు మునార్‌లో చాయా తోటల సందర్శన, టెక్కడిలో వన్యప్రాణి అభయారణ్యం, కుమరకొంలో బ్యాక్‌వాటర్‌లు, అల్లెప్పీలో బోట్ హౌస్ అనుభవాలు పొందవచ్చు. ప్రయాణ సమయంలో వసతి, భోజనం, టూరిస్ట్ బస్ రైడ్, లోకల్ గైడ్.. అన్నీ కలిపి ఒక ఆల్-ఇన్-వన్ ప్యాకేజీలా ఉంటుంది.

స్పెషల్ నోట్..
3 మందికంటే ఎక్కువ సభ్యులతో బుక్ చేస్తే, గ్రూప్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ప్యాకేజీకి సంబంధించి ఇతర తేదీల కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్ కో-ఆర్డినేటర్లను సంప్రదించాలని సూచించారు.

మీకు ఇది ఎందుకు కావాలి?
మనలో చాలామందికి ఒక్క ట్రిప్ అయినా కేరళకి ప్లాన్ చేద్దామనే డ్రీమ్ ఉంటుంది. కానీ ఎప్పుడు, ఎలాగో క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఆ డ్రీమ్‌ను ఫిక్స్‌ చేసుకునే టైం ఇది. ఖర్చు లిమిటెడ్, డెస్టినేషన్ డ్రీమి, ఫెసిలిటీ ప్రీమియం.. మరి ఇంకేం కావాలి? ఈ ట్రిప్ ఒక టూరిస్ట్ ప్రయాణం కాదు.. ఇది ఓ జీవనానుభవం. పని, ఒత్తిడి, కాలక్షేపం అన్నిటికీ బ్రేక్ వేసి, ప్రకృతిలోకి ప్రయాణించాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. మీ ఫోన్‌ గ్యాలరీ ఫోటోల్లో మారిపోయేలా, మీ మనసులో సుదీర్ఘ ముద్ర వేసేలా ఉంటుంది ఈ ట్రిప్.

Related News

Cherlapally Station: చర్లపల్లి స్టేషన్ కు అదనపు MMTS రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వ్యాఖ్యలు!

Rakhi Delivery on Trains: నేరుగా రైలు సీటు దగ్గరికే రాఖీలు, ఐడియా అదిరింది గురూ!

Visakhapatnam Expressway: టన్నెల్ ఒడిశాలో.. లాభం మాత్రం విశాఖకే.. ఎలాగంటే?

Multi train ticket: ఒకే టికెట్‌తో మల్టీ ట్రైన్స్ రైడ్… ఛాన్స్ కేవలం ఆ నగరానికే!

AP railway development: ఏపీలో చిన్న రైల్వే స్టేషన్.. ఇప్పుడు మరింత పెద్దగా.. స్పెషాలిటీ ఏమిటంటే?

Hitec city Railway station: కళ్లు చెదిరేలా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌, చూస్తే వావ్ అనాల్సిందే!

Big Stories

×