BigTV English
Advertisement

Iran Attack Qatar US Air Base: అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణిదాడి.. మండిపడిన ఖతార్

Iran Attack Qatar US Air Base: అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణిదాడి.. మండిపడిన ఖతార్

Iran Attack Qatar US Air Base| మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం రోజురోజుకీ తీవ్రమవుతోంది. అమెరికా వార్ లోకి ఎంట్రీ ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికాల దాడులకు ధీటుగా సమాధానమిస్తోంది. ఎదురుగా అమెరికా లాంటి ఆగ్రరాజ్యమున్నా.. ఒంటరి పోరాటం చేస్తోంది. తాజాగా ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా సైనిక బలగాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సోమవారం ప్రకటించింది.


ఈ దాడి జరిగే ముందు ఖతార్, ఇరాన్ నుండి వచ్చే ముప్పు కారణంగా తన వాయు ప్రదేశాన్ని మూసివేసింది. అయితే ఈ దాడిని ఖతార్ ఖండించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్పందించే హక్కు తమకు ఉందని పేర్కొంది. అధికారులు ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ధృవీకరించారు. అమెరికా అధికారి ఒకరు, ఇరాన్ నుండి వచ్చిన చిన్న, మధ్య రేంజ్ బాలిస్టిక్ క్షిపణులతో ఈ స్థావరంపై దాడి జరిగినట్లు తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

అమెరికా ఇటీవల ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ చేసింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం.. దాడిలో ప్రయోగించిన క్షిపణుల సంఖ్య అమెరికా వేసిన బాంబుల సంఖ్యకు సమానంగా ఉంది. ఇది ఘర్షణను మరింత తీవ్రతరం చేయకూడదనే ఉద్దేశాన్ని సూచిస్తుంది. ఈ స్థావరం జనావాస ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల దీనిని ఎంచుకున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూమ్‌లో రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్.. జాయింట్ చీఫ్స్ చైర్ జనరల్ డాన్ కైన్‌తో తదుపరి యుద్ధం కార్యచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.


ఇరాన్ అల్ ఉదీద్ స్థావరంపైనే ఎందుకు చేసింది?
అల్ ఉదీద్ స్థావరం.. అమెరికా సైన్యం, సెంట్రల్ కమాండ్ యొక్క ప్రధాన కార్యాలయంగా ఉంది. ఈ స్థావరంలో కంబైన్డ్ ఎయిర్ ఆపరేషన్స్ సెంటర్ ఉంది. ఇది ఈ ప్రాంతంలో వైమానిక శక్తిని నియంత్రిస్తుంది. అలాగే, ఇక్కడ 379వ ఎయిర్ ఎక్స్‌పెడిషనరీ వింగ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పెడిషనరీ వింగ్. గతంలో కూడా ఇరాన్ ఈ స్థావరంలోని అమెరికా బలగాలను బెదిరించిన సందర్భాలు ఉన్నాయి.

ఇరాన్ దాడుల గురించి అమెరికాకు ముందే సమాచారం..

ఆక్సియోస్ రిపోర్టర్ ఒకరు ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ, ట్రంప్ పరిపాలనకు ఇరాన్ దాడి గురించి ముందే తెలిసినట్లు తెలిపారు.

Also Read: ఇరాన్‌ యుద్ధంలో అమెరికా ఎంట్రీ.. ఇక జరుగబోయేది అదే

ఖతార్-ఇరాన్ సంబంధాలు
ఖతార్, పర్షియన్ గల్ఫ్‌కు అవతలి వైపున ఉన్న ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అలాగే, ఖతార్, ఇరాన్ కలిసి ఒక భారీ సముద్ర గ్యాస్ క్షేత్రాన్ని పంచుకుంటాయి.

ఇరాన్ రాష్ట్ర టెలివిజన్‌లో అల్ ఉదీద్ స్థావరంపై దాడి చేసినట్లు ప్రకటించింది. టీవీ స్క్రీన్‌పై “అమెరికా దురాక్రమణకు ఒక పవర్ ఫుల్, విజయవంతమైన స్పందన” అని ఒక క్యాప్షన్ ప్రదర్శించబడింది.

ఈ దాడికి ముందు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎక్స్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో.. “మేము యుద్ధాన్ని ప్రారంభించలేదు, దానిని కోరుకోవడం లేదు. కానీ గ్రేట్ ఇరాన్‌పై దాడికి సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టము.” అని రాశారు.

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×