Hollywood Ramayanam : భారతీయ పురాణాలలో, అలాగే భారతీయులపై రామాయణంకు ఉన్న ప్రత్యేకత ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇండియాలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరిని కదిలించినా అలవోకగా రామాయాణాన్ని చెప్పేస్తారు. అలాంటి రామాయణం ఇప్పటికే తెరపై సినిమాగా, సీరియల్ గా ప్రేక్షకులను అలరించింది. అయితే మరోసారి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం బిగ్ స్క్రీన్ పై ఈ ఎపిక్ స్టోరీని చూడాలని ప్రేక్షకులు ఉవ్విల్లూరుతున్నారు. అది నిజం కూడా అవుతోంది. కానీ ఎప్పుడైనా హాలీవుడ్ స్టార్స్ మన రామాయణంలో నటిస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా? అలాగే ఈ ఇంగ్లిష్ హీరోలు ఎవరు ఎలాంటి పాత్రలో బాగుంటారో ఊహించారా? లేదు కదా… ఇలా మన ఊహకు అందని అద్భుతాన్ని ఏఐ క్రియేట్ చేయడం విశేషం.
‘రామాయణం’కు హాలీవుడ్ ట్విస్ట్
రామాయణంకు హాలీవుడ్ ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నది ఆ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోలో రాముడిగా క్రిస్ హెంస్వర్త్, గాల్ గాడోట్ సీతగా, టామ్ హాలండ్ లక్ష్మణుడిగా, హనుమాన్ గా జాసన్ మోమోవా, మండోదరిగా ఎలిజబెత్ ఓల్సెన్, డానియల్ కలూయ భరతుడిగా, ఆంథోనీ హాప్ కిన్స్ దశరథుడిగా, లుపిటా న్యోంగ్ ఓ కైకేయి, టిల్డా స్విన్టన్ మంథర, టామ్ హార్డీ కుంభకర్ణుడి, ల్యూక్ ఇవాన్స్ శివుడిగా, జేక్ గిల్లెన్హాల్ ఇంద్రుడిగా దర్శనం ఇచ్చారు. హాలీవుడ్ స్టార్స్ అయినప్పటికీ ఈ ఏఐ క్రియేట్ చేసిన వీడియోలో, వాళ్లంతా అద్భుతంగా కన్పిస్తున్నారు. క్రిస్ హెమ్స్ వర్త్ తోర్ గా, గాల్ గాడోట్ వండర్ వుమన్, స్పైడర్ మ్యాన్ గా టామ్ హాలాండ్, జాసన్ ఆక్వా మ్యాన్ గా, ఎలిజబెత్ ఓల్సెన్ వాండా విజన్ గా మనకు సుపరిచితులు. ఇక ఈ వీడియోలో ఉన్న మిగతా నటీనటులు కూడా బిగ్గెస్ట్ హాలీవుడ్ స్టార్స్. మీరు గనుక ఇంకా ఈ వీడియోను చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.
Read Also : గ్రామాన్ని వల్లకాడు చేసే సైకో కిల్లర్.. బొమ్మ మాస్క్ తో అతి కిరాతకంగా హత్యలు… గ్రిప్పింగ్ నరేషన్
1600 కోట్లతో రామాయణం
ఇక ఈ ఎపిక్ ఇతిహాసాన్ని పాన్ వరల్డ్ స్క్రీన్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ మూవీని 1600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయబోతున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">