BigTV English

OTT Movie : గ్రామాన్ని వల్లకాడు చేసే సైకో కిల్లర్.. బొమ్మ మాస్క్ తో అతి కిరాతకంగా హత్యలు… గ్రిప్పింగ్ నరేషన్

OTT Movie : గ్రామాన్ని వల్లకాడు చేసే సైకో కిల్లర్.. బొమ్మ మాస్క్ తో అతి కిరాతకంగా హత్యలు… గ్రిప్పింగ్ నరేషన్

OTT Movie : సైకో కిల్లర్స్ రకరకాలుగా ఉంటారు. అందులో ఊహించని కిల్లర్ స్టోరీలతో థ్రిల్లర్ ప్రియులని అలరిస్తుంటారు మేకర్స్. ఈరోజు కూడా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీని తీసుకొచ్చేశాం. ఇందులో సైకో కిల్లర్ ఏకంగా ఊరిని డెవలప్ చేయడానికి వచ్చిన మున్సిపల్ టీంకు చుక్కలు చూపిస్తాడు. మరి ఆ కిల్లర్ ఎందుకలా చేశాడు? అనేది స్టోరీలో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “The Conference” (2023). పాట్రిక్ ఎక్లండ్ దర్శకత్వంలో రూపొందిన స్వీడిష్ కామెడీ-హారర్ స్లాషర్ ఫిల్మ్, మాట్స్ స్ట్రాండ్‌బర్గ్ రాసిన 2021 నవల “Konferensen” ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా 2023 అక్టోబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో గ్లోబల్‌గా ప్రీమియర్ అయింది. ఇందులో కాటియా వింటర్ (లీనా), ఆడమ్ లండ్‌గ్రెన్ (జోనాస్), ఈవా మెలాండర్, బహర్ పార్స్ (నాడ్జా) ప్రధాన పాత్రల్లో నటించారు.

కథలోకి వెళ్తే…
సినిమా ఒక స్వీడిష్ మునిసిపల్ కార్యాలయ ఉద్యోగుల బృందం చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ఒక మారుమూల స్వీడిష్ క్యాంప్‌సైట్‌లో టీమ్-బిల్డింగ్ రిట్రీట్ కోసం వస్తారు. ఈ రిట్రీట్ ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణంతో పాటు టీమ్ లో ఐక్యతను పెంచడానికి ప్లాన్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఒక రైతు భూమిని స్వాధీనం చేసుకుని చేపడతారు. ఈ బృందంలో ఇంగెలా అనే టాక్సిక్ పాజిటివిటీతో నడిచే బాస్, అత్యుత్సాహం, సెల్ఫీష్ మేనేజర్ జోనాస్, మానసిక ఆరోగ్యం కోసం విరామం తీసుకున్న తర్వాత తిరిగి పనిలో చేరిన లీనా, నాడ్జా (బహర్ పార్స్) అనే ఒక కొత్త ఉద్యోగి ఉంటారు.


రిట్రీట్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే, షాపింగ్ మాల్ ప్రాజెక్ట్ గురించి అవినీతి ఆరోపణలు బయటపడతాయి. ఈ ప్రాజెక్ట్ కోసం రైతు భూమిని స్వాధీనం చేసుకున్న విధానం కరెక్ట్ కాదని, రైతుకు సరైన పరిహారం ఇవ్వలేదని నాడ్జా, లీనా వంటి కొందరు ప్రశ్నిస్తారు. ఈ ఆరోపణలు జోనాస్, ఇంగెలా వంటి ప్రాజెక్ట్‌కు మద్దతు ఇచ్చే వారితో విభేదాలను సృష్టిస్తాయి. అదే సమయంలో ఒక మాస్క్‌తో ఉన్న సీక్రెట్ వ్యక్తి బృంద సభ్యులను ఒక్కొక్కరినీ హత్య చేయడం ప్రారంభిస్తాడు. ఈ హత్యలు దారుణంగా ఉంటాయి. ఒక వ్యక్తి హాట్ టబ్‌లో బోట్ ఇంజిన్‌తో చీలుస్తాడు. ఇలాంటి సీన్స్ ఎన్నో ఉంటాయి.

Read Also : లవర్స్ ను మార్చుకుని ఆ పాడు పనులు చేసే అన్నాతమ్ముడు… ఇదెక్కడి దిక్కుమాలిన మూవీరా అయ్యా

నెమ్మదిగా ఈ హత్యల వెనుక ఉన్న కారణం వెల్లడవుతుంది. అలాగే ఈ రిట్రీట్‌లో హత్యలు కొనసాగుతాయి. ప్రతి మరణం మునుపటి కంటే మరింత దారుణంగా ఉంటుంది. ఒక ముఖ్యమైన సన్నివేశంలో ఒక పాత్ర తన సహోద్యోగిని రక్షించడానికి తనను తాను త్యాగం చేసుకుంటాడు.చివరి క్షణాల్లో, లీనా, నాడ్జా వంటి కొద్దిమంది మాత్రమే మిగిలి ఉండగా,క్లైమాక్స్ ఊహించని సీన్స్ తో ముగుస్తుంది. ఇంతకీ ఈ బ్లడీ బ్లడ్ బాత్ కు కారణం ఏంటి? క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ ఏంటి? అనేడి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×