Mahesh Anil: ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఉంది మన నెటిజన్ల వ్యవహారం.అసలు మహేష్ బాబు,అనిల్ రావిపూడి వార్త ఎక్కడి నుండి వచ్చిందో కాని ఏకంగా టైటిల్స్ ,బ్యానర్స్ తో పాటు రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారు మన ఔత్సాహిక నెటిజన్లు.ఇక ఈ వార్త దావానంలా వ్యాపించడంతో అలెర్ట్ అయ్యాడు అనిల్ రావిపూడి.
మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ, గౌరవం అంటూనే మా ఇద్దరి మధ్య అసలు ఎలాంటి సినిమా చర్చలు జరగలేదని కుండబద్దలు కొట్టేశాడు. అనిల్ రావిపూడి పెట్టిన పోస్ట్ చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు తనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఆయనతో జర్నీ చాలా హ్యాపీగా ఉంటుందని,కానీ ప్రస్తుతం మా మధ్య అలాంటి సినిమా చర్చలు ఎలాంటివి జరగలేదని తేల్చిచెప్పాడు.మొత్తానికి గత కొన్ని రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలకి ఈ హిట్ మెషిన్ ఎట్టకేలకి ఎండ్ కార్డ్ వేశాడన్న మాట.
also read :ఇరుముడిలో నాగులు.. ఈ క్యారెక్టర్ వెనుక ఇంత కథ ఉందా?
ఇక వీరిద్దరి కాంబినేషన్ విషయానికి వస్తే సరిలేరు నీకెవ్వరు అనే సినిమా వీరి కాంబోలో వచ్చి సాలిడ్ హిట్ చూసిన సంగతి తెల్సిందే.దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూల్లని మాత్రం భారీగానే కొల్లగొట్టింది.ముఖ్యంగా ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ పండించిన నటన, రష్మిక చేసిన అమాయకపు క్యారెక్టర్ సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి.
ఇక మహేష్ సినీ కెరీర్ చూస్తే ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సర్కారు వారి పాట’, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు ఆయనని మరో రేంజ్ కి తెసికెళ్ళగా ఇపుడు అందరి చూపు వారణాసిపైనే ఉంది. ఇక ఈ సినిమా ని ఉగాది సందర్భంగా వచ్చే ఏడు ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.
నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ రావడం కొత్తేమీ కాదు. గతంలో ఇలా అన్ అఫీషియల్ గా ముహుర్తాలు పెట్టుకున్న సినిమాలు కోకొల్లలు. ఇదీ అలాంటి వాటిల్లో ఒకటనే చెప్పుకోవాలి.ఎందుకంటే మహేష్ బాబు అసలే ఏ మాత్రం గ్యాప్ లేకుండా వారణాసితో తెగ బిజీగా గడిపేస్తున్నాడు.
మహేష్ వచ్చే ఏడు ఏప్రిల్ వరకు ఫ్రీ అయ్యే అవకాశం లేదు. ఇటు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి కూడా ఒక సినిమా సెట్ పై ఉండగానే మరో సినిమాకి సెట్ చేసేసుకుంటున్నాడు.అలాంటిది వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అది అసాధ్యమనే చెప్పాలి.
also read :తెలుగు ఒక్క ముక్క కూడా రాదు.. కానీ ఇరుముడిలో మాత్రం ఇరగదీసింది!
చూడాలి మరి ఈ సారి అయితే లేదంటూ కుండబద్దలు కొట్టేస్తున్న అనిల్ రావి పూడి వచ్చే రోజుల్లో అయినా మరోసారి మహేష్ బాబుతో ఎలాంటి కథతో వస్తాడో చూడాలి !
Superstar @UrstrulyMahesh garu has always been a dear person to me. ❤️
I have immense love and respect for him, always. 🙏🏻
Whatever news is currently circulating is completely false and untrue. Please don’t believe or spread such rumours. https://t.co/VrSEJOF9yI
— Anil Ravipudi (@AnilRavipudi) August 25, 2026