Kalpavriksha Tree: విజయవాడ తూర్పు నియోజకవర్గం GEV రాధా మాధవ అపార్ట్మెంట్‌లో కల్పవృక్షాన్ని ప్రతిష్టించారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వేద పండితులు, శ్రీ చిన్నజీయర్ స్వామి వేద పాఠశాల పురోహితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణాజిల్లా జెడ్పి మాజీ చైర్మన్ గద్దె అనురాధ, ప్రముఖ వ్యాపారవేత్త పుట్టకొండ సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అయితే, సాధారణంగా ఇళ్లల్లోనో.. అపార్ట్‌మెంట్స్‌లోనో కనిపించే మొక్క కాదు ఈ కల్పవృక్షం. దీనికి పురాణ ఇతిహాసాల్లో ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి యుగం నుండి ఈ మొక్క ఎంతో చరిత్ర కలిగినదని చెప్తారు హిందూ పండితులు. దక్షిణ భారతదేశంలో ఈ వృక్షం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇంట్లో ప్రతికూల శక్తి నశించి, సానుకూలత పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. సనాతన ధర్మంలో కొన్ని చెట్లు, మొక్కలను దేవతలతో సమానంగా పూజిస్తారు. అలాంటి మొక్కల్లో కల్పవృక్షం అత్యంత ప్రధానమైనది.
Also read: ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?
కల్పవృక్షం ఆనాడు దేవతలకి అమృతం ఇచ్చేదని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇంట్లో కల్పవృక్షం ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇది ఇంట్లోని దరిద్రాన్ని దూరం చేసి, సంపదను, ధాన్య సమృద్ధిని పెంచుతుందని విశ్వాసం. కల్పవృక్షం గాలి తరంగాల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి, శాంతి, సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఇదీ కల్పవృక్షం ప్రత్యేకత.
Also read: డీజిల్ ఖర్చు తగ్గించేందుకు రైల్వే కొత్త ప్లాన్.. ఫస్ట్ LNG రైలు వచ్చేసింది!