Sardar 2 OTT: తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్తి (Karthi) ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కార్తి పీఎస్ మిత్రన్(P.S.Mitran) దర్శకత్వంలో నటించిన సర్దార్ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఇటీవల సర్దార్ 2 (Sardar 2)ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోలేకపోయింది. ఇలా థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. థియేటర్లలో మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఏ విధమైనటువంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది.
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన కేవలం 20 రోజుల వ్యవధిలోనే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేటర్లలో డిజాస్టర్ సొంతం చేసుకున్న నేపథ్యంలోనే 20 రోజులకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
ఇక ఈ సినిమాలో కార్తీ ఒక స్పై పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సర్దార్ 2 సినిమాలో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. రా ఏజెంట్ చంద్రబోస్ అలియాస్ సర్దార్‌గా, ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్ గా అలరించారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎస్. లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్పై మూవీగా ఎన్నో సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక నిరాశపరిచింది.. థియేటర్లలో మెప్పించ లేకపోయిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ 10 సుధీర్ బర్త్డే.. గొప్ప పనికి శ్రీకారం చుట్టిన ఫ్యాన్స్!