E-Paper
Advertisement

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఎలాన్ మస్క్‌పై భారతీయులు  ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?
Advertisement

Elon Musk Vs Kamal: భారత్ రాజకీయాల్లోకి వేలు కెలకడం మొదలుపెట్టారు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్. తన వ్యాపారాలు చూసుకోకుండా దేశీయ పారిశ్రామిక వేత్తలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. స్టార్‌లింక్ లైసెన్సుల వ్యవహారం ప్రభుత్వంతో మాట్లాడు కోవాల్సిందిపోయి, దుమ్మెత్తిపోవడం మొదలుపెట్టారు. అంతేకాదు ప్రభుత్వానికి-దేశీయ వ్యాపారవేత్తలకు లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేస్తున్న కామెంట్స్‌పై భారతీయులు ఓ రేంజ్‌లో మండిపడ్డారు.

ఎలాన్ మస్క్‌ కామెంట్లపై భారతీయులు ఆగ్రహం

దేశంలో స్టార్‌లింక్ సేవల వ్యాపారానికి ప్లాన్ చేసుకున్నారు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్. లైసెన్స్‌ రావడం డిలే కావడంపై రియాక్ట్ అవుతున్నారు. భారత ప్రధాని అంబానీనా? అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. తొలుత లైట్‌గా తీసుకున్నారు భారతీయులు. ఆ తర్వాత మస్క్ రకరకాల కామెంట్స్ చేయడంపై భారతీయులు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. దీనిపై రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ధీటుగా బదులిచ్చారు. ఏ బిలియనీర్ అయినా అది భారతీయలు, అమెరికన్ల అయినా ఆ దేశ విధానాలను నిర్దేశించలేరన్నారు.

మస్క్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్

Advertisement

ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని గుర్తు చేశారు కమల్ హాసన్. భారత్ ప్రజాస్వామ్య దేశమని, వలస దేశం కాదన్నారు. మేము ప్రపంచాన్ని స్వాగతిస్తామని, మా భవిష్యత్తును నిర్ణయించుకుంటామని మనసులోని మాట బయటపెట్టారు. స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడితే పశ్చిమ దేశాలు రక్షణాత్మక విధానాలు పాటిస్తున్నాయని విమర్శించారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా 100 శాతం సుంకాలు విధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు సదరు ఎంపీ. భారత్ కూడా అదే విధంగా తన దేశీయ తయారీ రంగాన్ని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటోందని గుర్తు చేశారు.

మస్క్‌ని ప్రశ్నించిన రచయిత రాజీవ్ మల్హోత్రా

మరోవైపు చైనాలో టెస్లా భారీగా పెట్టుబడులు పెట్టిందని, అక్కడ స్టార్‌లింక్‌‌ను ఎందుకు అడ్డుకుంటుందని రచయిత రాజీవ్ మల్హోత్రా ప్రశ్నించారు. ఆ దేశంపై ఎలాన్ మస్క్‌కు ఎందుకు ఆగ్రహించలేదని ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు. స్టార్‌లింక్ వ్యవహారం సాంకేతికత, సేవల నాణ్యతకు మించినదని అన్నారు. దీనికి సార్వభౌమాధికారంతో చాలా సంబంధం ఉందని మల్హోత్రా చెప్పుకొచ్చారు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయని, అందువల్ల ఆలస్యమవుతోందన్నారు.

Advertisement

ALSO READ: ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

ఎలాన్ మస్క్ మాటలపై ప్రభుత్వం స్పందించింది. ముగ్గురు లైసెన్సుదారుల విషయంలో భద్రతా మదింపు జరుగుతోందన్నారు. లైసెన్సు పొందిన సంస్థకు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అది స్పెక్ట్రమ్ కేటాయింపు కోరే దశకు వెళ్తుందన్నారు. మూడు సంస్థలు దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయిని ప్రభుత్వం చెబుతోంది. ముగ్గురు లైసెన్సుదారులు స్టార్‌లింక్, జియో సాట్‌కామ్, యూటెల్‌శాట్ వన్‌వెబ్ ఉన్నారు.

 

Related News

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×