Ilaiyaraaja : ఇండస్ట్రీలో కొంతమందికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రతి పని మంచి సక్సెస్ అవడంతో వాళ్లకి జనాలు నీరాజనం పలుకుతారు. ఇండస్ట్రీలో అనేక వర్గాలవారు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో మ్యూజిక్ మాస్ట్రో గా ఇండియన్ సినీ హిస్టరీలో ఇళయరాజా ఒకరు. ఇళయరాజా ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇళయరాజా మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయనకు కూసింత గర్వం కూడా ఉంటుంది అని ఇండస్ట్రీలోని కొందరు చెవులు కోరుకుంటున్నారు.. ఈమధ్య ఈయన నిత్యం ఏదో ఒక వార్తతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మరొక కేసు తో హైలెట్ అవుతున్నాడు. ఇంతకీ ఆ కేసు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పేరు ఈమధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. తాజాగా మరోసారి హైలైట్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ చిత్రం గుడ్ అండ్ అగ్లీ.. ఈ సినిమాలో తన అనుమతి లేకుండా తాను కంపోస్ట్ చేసిన పాటలను దొంగతనం చేశారంటూ ఇళయరాజా మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇళయరాజా న్యాయవాదులు తెలిపారు .. ఈమూవీ వివాదాలతో థియేటర్లలోకి వచ్చేసింది. అయితే అసలు ఊహించుకుందా 250 పైగా కోట్లను వసూలు చేసింది. ఇందులో ఆయన అనుమతి లేకుండా కొన్ని పాటలను వాడినట్లు కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుత ఇది కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఈ వారం దారుణంగా పడిపోయిన సీరియల్స్ రేటింగ్.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?
ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని తీసుకెళ్లి వేరే సినిమాలలో పెడితే అది కచ్చితంగా కాపీరైట్ అవుతుంది. ఈమధ్య సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. తాజాగా లెజెండ్రి డైరెక్టర్ ఇళయరాజా కంపోస్ట్ చేసిన పాత పాటలను ఈ సినిమాలో వాడారని ఆయన ఆరోపిస్తూ మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు చేశారు. దీనికోసం ఆయన రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. అంతే కాదు ఈ మూవీ నుంచి ఆ పాటలను ఒక ఏడు రోజులపు పూర్తిగా డిలీట్ చేయాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇళయరాజా అనుమతి లేకుండాఆయన పాటలను పలుసినిమాల్లో నిరంతరం ఉపయోగించడాన్ని నిషేధించాలనివారుకోరారు. ఇప్పటివరకు ఉపయోగించుకున్నవారుతగిన పరిహారం చెల్లించాలని తెలిపారు. ఈ కేసు సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ ముందు విచారణకు రానుంది.. గతంలో ఇలాంటి కేసులు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేవి. ఈమధ్య మ్యూజిక్ డైరెక్టర్లు వేరే భాషల నుంచి కూడా కాపీ కొడుతున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడేమో ఇలా సినిమాలోని లిరిక్స్ ని కాపీ కొట్టడం ఏ మాత్రం తగునా అంటూ ప్రేక్షకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈమధ్య మంచి పాటలను ఎక్కువగా కంపోస్ట్ చేస్తున్నారు.