BigTV English

OTT Movie : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ
Advertisement

OTT Movie : హారర్ జానర్ లో వచ్చే సినిమాలు భయపెట్టిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ సినిమాలను చూస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ ను మిగతా సినిమాలు ఇవ్వలేవు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా డిఫరెంట్ కథతో వచ్చింది. ఒక ఆత్మ ప్రెగ్నెంట్ అమ్మాయిలను టార్గెట్ చేసి, వాళ్ళని దారుణంగా చంపుతుంటుంది. ఒక రోడ్ ట్రిప్ లో జరిగే ఈ స్టోరీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ సినిమా ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

లండన్‌లో ఒక రోజు రాత్రి అన్నే అనే యువతి తన ఫియాన్సీ పాట్రిక్ తో డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ కి వెళ్తుంది. వీళ్ళ సంబంధం ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉంటుంది. పాట్రిక్ దురుసు ప్రవర్తన, అన్నే ప్రెగ్నెన్సీ గురించి ఈ జంటకి విభేదాలు వస్తాయి. ఇక డిన్నర్ తర్వాత ఇంటికి వెళ్లడానికి ఈ జంట ఒక బ్లాక్ క్యాబ్‌ను ఎక్కుతారు. అన్నే, పాట్రిక్ క్యాబ్ లో కూడా గొడవపడుతుంటారు. క్యాబ్ డ్రైవర్ ఇయాన్ మొదట స్నేహపూర్వకంగా కనిపిస్తాడు. అన్నేకు ఏదైనా సహాయం అవసరమా అని అడుగుతాడు. పాట్రిక్‌ను క్యాబ్ నుండి గెంటేయాలా అని నవ్వుతూ అంటాడు. కానీ త్వరలోనే అతని క్రుయాలిటీ బయటికి వస్తుంది. ఇయాన్ వారిని ఇంటికి తీసుకెళ్లకుండా, మాయబెల్ హిల్ అనే హాంటెడ్ రోడ్‌కు తీసుకెళ్తాడు. ఇయాన్ ఈ జంటను టేజర్‌తో కొట్టి బంధిస్తాడు. అక్కడ ఒక మహిళ ఆత్మ తన బిడ్డ కోసం వెతుకుతూ తిరుగుతుందని వాళ్లకు చెప్తాడు. తన భార్యతో విభేదాల కారణంగా తన కొడుకును చంపాలని ఈ ఆత్మ హాంట్ చేస్తోందని వెల్లడిస్తాడు.


ఇయాన్ గతంలో అన్నేను మెటర్నిటీ హాస్పిటల్ నుండి తీసుకెళ్లినప్పుడు ఆమె గర్భవతిగా ఉందని తెలుసుకుని, ఆమె బిడ్డను ఆత్మకు బలిచ్చి తన కొడుకును రక్షించాలని పన్నాగం పన్నుతాడు. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అన్నే తన గర్భస్రావం గురించి అతనికి చెప్తుంది. ఇది ఇయాన్ పథకాన్ని తారుమారు చేస్తుంది. ఇయాన్ అన్నే, పాట్రిక్‌లను చంపాలని చూస్తాడు. మొదటగా పాట్రిక్‌ను హత్య చేస్తాడు. ఈ సమయంలో అన్నే పిచ్చిదానిలా తన బిడ్డను ఆత్మ తీసుకుందని అరుస్తూ అడవిలోకి పరుగెత్తుతుంది. ఇక ఈ స్టోరీ ఒక భయంకరమైన మలుపు తీసుకుంటుంది. చివరికి ఈ ఆత్మ ఎవరు ? ఎందుకు పిల్లలను బలితీసుకుంటోంది ? అన్నే ను ఇయాన్ చంపుతాడా ? ఆత్మ చేతిలో వీళ్ళు బలవుతారా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

ఎందులో ఉందంటే

‘బ్లాక్ క్యాబ్’ (Black cab) 2024లో విడుదలైన బ్రిటిష్ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రం. బ్రూస్ గూడిసన్ దర్శకత్వంలో, నిక్ ఫ్రాస్ట్ (ఇయాన్), సిన్నోవ్ కార్ల్‌సెన్ (అన్నే), లూక్ నోరిస్ (పాట్రిక్), టెస్సా పార్ (జెస్సికా), జార్జ్ బుఖారీ (ర్యాన్), టిల్లీ వుడ్‌వర్డ్ (ఘోస్ట్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 నవంబర్ 8న షడ్డర్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 87 నిమిషాల రన్‌టైమ్‌తో ఇంగ్లీష్ ఆడియోతో, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Read Also : ఆ అపార్ట్మెంట్ లో అందరూ అలాంటి వాళ్ళే… మహిళ మిస్సింగ్ తో లింకు.. లిఫ్ట్ లో నడిచే క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ

Related News

OTT Movie : వాష్ రూమ్‌లో వరస్ట్ ఎక్స్పీరియన్స్… ‘విరూపాక్ష’ను మించిన చేతబడి… స్పైన్ చిల్లింగ్ సీన్స్

OTT Movie : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్‌… ఇంకా చూడలేదా ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్… ఓటీటీలో నెల రోజులుగా ట్రెండ్ అవుతున్న మూవీ… ఇంకా టాప్ 5 లోనే

Conistable Kanakam: ఫ్రీగా సినిమా చూడండి.. ఐఫోన్ గెలుచుకోండి ..బంపర్ ఆఫర్ ఇచిన మూవీ టీమ్!

OTT Movie : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్ లు… ఒక్కో భాషలో ఒక్కో సినిమా… ఈ 4 డోంట్ మిస్

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : 456 మంది ఆటగాళ్ళు…. 40 కోట్ల నజరానా… ఇండియాలో ‘స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Big Stories

×