BigTV English

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?
Advertisement

OTT Movie : ఓటిటిలోకి రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ‘మొగలిరేకులు’ సీరియల్ తో పేరు సంపాదించుకున్న ఆర్.కె.సాగర్ కథానాయకుడిగా ఇందులో నటించాడు. షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న శశిధర్ ఈ సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించారు. మహిళలపై జరిగే నేరాల చుట్టూ ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

హైదరాబాద్‌లో శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా నియమితుడైన ఐపిఎస్ అధికారి విక్రాంత్ ఒక సీరియస్ కేసును ఛేదించడానికి అసైన్ అవుతాడు. నగరంలో అమావాస్య రోజుల్లో జరుగుతున్న దొంగతనాలు, హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంటాయి. ఈ దొంగలు ఇళ్లలోకి చొరబడి నగదు, ఇతర విలువైన వస్తువులను వదిలేసి కేవలం బంగారం మాత్రమే దొంగిలిస్తుంటారు. ఇదే సమయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధు ప్రియ (విష్ణు ప్రియ) ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ సమీర్‌తో జరిగిన గొడవ తర్వాత ఈ ఘటన జరుగుతుంది. విక్రాంత్ ఈ రెండు కేసులను దర్యాప్తు చేస్తూ, భరతనాట్యం డాన్సర్ ఆర్తి (మిషా నారంగ్)ని కలుస్తాడు. ఆమె ఇంట్లో కూడా దొంగతనం జరుగుతుంది. అంతే కాకుండా ఈ ఘటనలో ఆమె బలాత్కారానికి గురవుతుంది. ఈ దారుణాన్ని ఆగంతకులు వీడియో కూడా తీస్తారు. ఇది విక్రాంత్‌ను వ్యక్తిగతంగా కలచివేస్తుంది.

విక్రాంత్ తన స్నేహితురాలు విద్యా (ధన్య బాలకృష్ణ) సహాయంతో కేసును ముందుకు తీసుకెళ్తాడు. ఈ దర్యాప్తులో, దొంగతనాలు, ఆర్తిపై దాడి, మధు ప్రియ ఆత్మహత్య ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని వల్లభ్ (తారక్ పొన్నప్ప)తో ముడిపడి ఉన్నాయని తెలుస్తుంది. విద్యా ఆ కంపెనీలో సీక్రెట్స్ ని తెలుసుకుని షాక్ అవుతుంది. ఇక్కడ మహిళలు దారుణంగా వేధింపులకు గురవుతుంటారు. ఇది ఒక నెట్ వర్క్ లా సాగుతుంటుంది. ఇక క్లైమాక్స్ లో వల్లభ్ తో పాటు అసలు నేరస్తులు బయటికి వస్తారు. క్లైమాక్స్ దిమ్మతిరిగే ట్విస్టులు ఇస్తుంది. ఇంతకీ అమావాస్య రోజే నేరాలు ఎందుకు జరుగుతున్నాయి ? ఆర్తిపై అఘాయిత్యం ఎందుకు జరిగింది ? మధు ప్రియ ఎందుకు ఆత్మ హత్య చేసుకుంది ? బంగారాన్నే ఎందుకు దొంగలిస్తున్నారు ? విక్రాంత్‌ ఈ కేసును ఎలా డీల్ చేశాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

‘ది 100’ 2025లో విడుదలైన తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో, ఆర్‌కె సాగర్ (విక్రాంత్), మిషా నారంగ్ (ఆర్తి), ధన్య బాలకృష్ణ (విద్యా), విష్ణు ప్రియ (మధు ప్రియ), తారక్ పొన్నప్ప (వల్లభ్), కల్యాణి నటరాజన్, లక్ష్మీ గోపాలస్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జులై 11న విడుదలై, 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 8.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో, ఇంగ్లీష్, తమిళ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Read Also : అమ్మాయిలనే టార్గెట్ చేసే ఏలియన్… అర్ధరాత్రి బట్టలన్నీ విప్పి అలాంటి పని… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్

Related News

OTT Movie : వాష్ రూమ్‌లో వరస్ట్ ఎక్స్పీరియన్స్… ‘విరూపాక్ష’ను మించిన చేతబడి… స్పైన్ చిల్లింగ్ సీన్స్

OTT Movie : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్‌… ఇంకా చూడలేదా ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్… ఓటీటీలో నెల రోజులుగా ట్రెండ్ అవుతున్న మూవీ… ఇంకా టాప్ 5 లోనే

Conistable Kanakam: ఫ్రీగా సినిమా చూడండి.. ఐఫోన్ గెలుచుకోండి ..బంపర్ ఆఫర్ ఇచిన మూవీ టీమ్!

OTT Movie : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్ లు… ఒక్కో భాషలో ఒక్కో సినిమా… ఈ 4 డోంట్ మిస్

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : 456 మంది ఆటగాళ్ళు…. 40 కోట్ల నజరానా… ఇండియాలో ‘స్క్విడ్ గేమ్ ది ఛాలెంజ్ సీజన్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Big Stories

×