E-Paper
Advertisement

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!
Advertisement

Visa Free Countries for Indians 2026: విదేశాలకు వెళ్లి కొత్త ప్రదేశాలను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే వీసా ప్రాసెస్, అవసరమైన డాక్యుమెంట్స్ లాంటి కారణాలతో చాలామంది తమ ప్రయాణాన్ని వాయిదా వేస్తుంటారు. కానీ, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు.. ప్రపంచంలోని 27 దేశాలు వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా వివరాల ప్రకారం, ప్రస్తుతం 27 దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ, 47 దేశాలు వీసా ఆన్ అరైవల్, మరో 66 దేశాలు ఈ వీసా సౌకర్యం భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారికి అందిస్తున్నాయి. మొత్తంగా భారతీయులు 74 దేశాలకు ఈజీగా వెళ్లే అవకాశం ఉంది.

పొరుగు దేశాలకు సులభంగా ప్రయాణం

భారతీయులు ఎలాంటి వీసా అవసరం లేకుండా నేపాల్ వెళ్లవచ్చు. అలాగే, భూటాన్ కూడా వీసా లేకుండానే అనుమతిస్తుంది. అయితే, అక్కడికి చేరుకున్న తర్వాత ఎంట్రీ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్యాటకులకు ఇష్టమైన థాయ్‌లాండ్ ప్రస్తుతం భారతీయులకు 30 రోజుల వరకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తోంది. అలాగే మలేషియా కూడా డిసెంబర్ 2026 వరకు 30 రోజుల పాటు వీసా లేకుండా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇక కజకిస్తాన్ 14 రోజుల వరకు, ఇరాన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి 15 రోజుల వరకు, మకావు 30 రోజుల వరకు వీసా లేకుండా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నాయి.

బీచ్ దేశాలకు వెళ్లాలనుకుంటే..

Advertisement

సముద్ర తీర ప్రాంతాల్లో విహరించాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలున్నాయి. మారిషస్ లో 90 రోజుల వరకు వీసా అవసరం లేదు. ఫిజీలో 120 రోజుల వరకు ఉండొచ్చు. అయితే, అక్కడికి చేరుకున్న తర్వాత విజిట్ పర్మిట్ తీసుకోవాలి. అలాగే కుక్ ఐలాండ్స్, నియు, వనౌటు లాంటి ద్వీప దేశాలు కూడా భారతీయులకు వీసా లేకుండా ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

కరేబియన్ దేశాల్లోనూ వీసా అవసరం లేదు

బార్బడోస్, డొమినికా, గ్రెనెడా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, జమైకా, మాంట్‌సెరాట్ లాంటి కరేబియన్ దేశాల్లో కూడా భారతీయులు నిర్ణీత కాలం వరకు వీసా లేకుండానే పర్యటించవచ్చు.

ఆఫ్రికా, ఇతర దేశాలు కూడా

Advertisement

సెనెగల్, గాంబియా, అంగోలా లాటి ఆఫ్రికా దేశాలు కూడా భారతీయులకు వీసా ఫ్రీ ప్రవేశాన్ని అందిస్తున్నాయి. అదేవిధంగా హైతీ, ఎల్ సాల్వడార్, మైక్రోనేషియా వంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రయాణానికి ముందు ఒకసారి రూల్స్ చెక్ చేయండి!

వీసా లేకుండా ప్రయాణించవచ్చని చెప్పినా, ప్రతి దేశానికి ఎంట్రీ రూల్స్ వేర్వేరుగా ఉండొచ్చు. కొన్ని దేశాల్లో గరిష్టంగా 14 రోజులు, మరికొన్నింటిలో 30, 90, 120 రోజుల వరకు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది. అలాగే రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, తగినంత డబ్బు లాంటి డాక్యుమెంట్స్ కోరే అవకాశం కూడా ఉంటుంది. అందుకే, ప్రయాణానికి ముందు అన్ని వివరాలను చెక్ చేసుకోవడం మంచిది.

Read Also: ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

Related News

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

సాధారణ విహారయాత్రలకు గుడ్‌బై చెబుతున్న భారతీయులు.. కల్చర్ ట్రావెల్ ఇప్పుడు కొత్త ట్రెండ్

పరిగెత్తుకొచ్చి రైలు కింద తలపెట్టిన వ్యక్తి.. మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!

విశాఖకు 45 కి.మీల దూరంలోనే ఎయిర్ పోర్ట్ ఎందుకు కట్టారు? విమానాశ్రయం కట్టాలంటే ఇన్ని రూల్సా?

ఎవరెస్ట్ మాత్రమే కాదు.. ఈ 7 పర్వతాలు ఎక్కడం చాలా ప్రమాదకరం

Big Stories

Advertisement
×