Adarsha kutumbam:సాధారణంగా సినిమా.. ఆడియన్స్ వరకు చేరాలి అంటే మేకర్స్ ముందుగా తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. కథ కథనం బాగుంటేనే సినిమా సక్సెస్ అవుతుంది.. అది వేరే విషయం. కానీ ఆ సినిమా ఆడియన్స్ వరకు వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసరి. అది నేరుగా ప్రమోట్ చేసినా.. సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసినా.. ఎలా చేసినా సరే తమ సినిమాను ఆడియన్స్ వరకు చేర్చాలి అనే తపన ప్రతి సినిమా మేకర్స్ లో ఉంటుంది. అందుకే విడుదల తేదీకి చాలా సమయం ఉన్నా.. ఇప్పటినుంచే వరుస ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు మాటల మాంత్రికుడు గురూజీ అలియాస్ త్రివిక్రమ్ (Trivikram).. విక్టరీ వెంకటేష్(Venkatesh ) హీరోగా, శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్గా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 నుండి వరుస అప్డేట్లు వదులుతూ ప్రేక్షకులలో అంచనాలు పెంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే జూలై 27వ తేదీన విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో చిట్టిబాబు పాత్ర పోషిస్తున్నాడు అంటూ ఒక టీజర్ విడుదల చేసిన మేకర్స్. జూలై 28వ తేదీన శ్రీనిధి శెట్టి స్వర్ణ అనే పాత్రలో నటిస్తున్నట్లు మరో వీడియోతో ఆకట్టుకున్నారు. ఈరోజు వెంకటేష్ కూతురు చిట్టితల్లిగా సంపూర్ణ పాత్రలో నటిస్తున్న యువినా పార్థవి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఇందులోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
also read:ఫ్యాన్స్ కోసం మెగా,అల్లు హీరోలేనా.. మరి మిగిలిన హీరోలు?
తాజాగా విడుదల చేసిన వీడియోలో.. తాను కొత్తగా తీసుకున్న ఇంట్లో కూర్చొని. ” ఇక మనకి కొత్తగా ప్రాబ్లమ్స్ ఏవి లేవండి.. రిజిస్ట్రేషన్ చేసేసి.. మీ కమిషన్ మీకు ఇచ్చేసానంటే.. హిందూ పేపర్ చదువుకుంటూ రిటైర్డ్ తెలుగు టీచర్ లాగా లుంగీ నలగకుండా బ్రతికేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా.. సడన్గా ఆయన కూతురు సంపూర్ణ ఎంట్రీ ఇస్తుంది. నాన్న నేను ప్రేమలో పడ్డాను అంటూ చాలా ఎక్సైట్ గా చెబుతుంది సంపూర్ణ. ఈసారి ఎవరు కార్ మెకానికా అంటూ కాస్త వెటకారంగా అడుగుతాడు వెంకటేష్. దానికి సంపూర్ణ .. నీకెలా తెలుసు అనగానే అసలు నీ వయసుకు లవ్ అంటే ఏంటో తెలుసా? అని వెంకటేష్ ప్రశ్నిస్తాడు.. దానికి స్వరూప..” నాకేమవుతుందో అన్న బాధ కన్నా వాడికేం అవుతుందో అన్న భయం ఎక్కువైతే అదే ప్రేమ”.. అంటూ చెప్పిన డైలాగు థియేటర్లలో నవ్వులు పూయించేలా ఉంది. మొత్తానికైతే ఆదర్శ కుటుంబం అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అదిరిపోయే డైలాగ్స్ తో అంతకు మించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించబోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా నెటిజన్స్ మాత్రం ఇది అనిల్ రావిపూడి సినిమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. “ఒకరేమో పూర్తిగా అనిల్ రావిపూడి లాగా మారిపోయిన త్రివిక్రమ్ ను చూడండి” అని కామెంట్ చేస్తే.. మరొకరేమో “త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ సినిమాలో బిజీగా ఉన్నారు. రహస్యంగా ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు “అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో “ఎఫ్2 సిరీస్ లో డిలీటెడ్ సీన్స్ లాగా ఉన్నాయి” అని కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా వరుసగా స్పీడ్ పెంచి అప్డేట్స్ వదులుతున్నప్పటికీ. నెటిజన్స్ మాత్రం ఇది పక్కా అనిల్ రావిపూడి మూవీ అంటూ కామెంట్లు చేయడం మరో ఎత్తు.