RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 17 సంవత్సరాల తరువాత ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా టీమిండియా కీలక క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆడుతున్న ఆర్సీబీ జట్టుకి ఒక్కసారి కూడా టైటిల్ దక్కలేదని చాలా 2025 కంటే ముందు వరకు కూడా అభిమానులు బాధపడేవారు. 2025 సీజన్ లో ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోగానే విరాట్ కోహ్లీ సైతం కన్నీరు పెట్టుకోవడం గమనార్హం. మరోవైపు సోషల్ మీడియాలో ఆర్సీబీ పై ప్రస్తుతం రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున 2026 సీజన్ వరకే ఆడనున్నట్టు తెలుస్తోంది.
అలాగే రోహిత్ శర్మ సైతం ముంబై ఇండియన్స్ 2026 సీజన్ కి ఆడి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అమ్మేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించడం విశేషం. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయాలయ్యాయి. అతను దాదాపు 4 నెలల వరకు ఆడడు. అంటే ఐపీఎల్ సీజన్ కి అందుబాటులో ఉంటాడో ఉండడో అనేది డౌట్ గానే అనిపిస్తోంది. ఇక బెంగళూరును కాపాడటం కష్టం అనే చెప్పవచ్చు. జట్టును అమ్ముతున్నారనే వార్తలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోవార్త కూడా చక్కర్లు కొడుతుంది. 2026 ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడే మ్యాచ్ లకు సొంత గడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా జరుగదని టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే..? గత ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. టోర్నీ గెలిచిన తరువాత ఆర్సీబీ బెంగలూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. బెంగళూరులో జరిగిన ఆర్సీబీ పరేడ్ విషాదంగా ముగిసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11 మంది మరణించిన విషయం విధితమే. దాదాపు 52 మంది వరకు గాయపడ్డారు. దాదాపు 17 సంవత్సరాల తరువాత 18వ ట్రోఫీని ఆర్సీబీ గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకోవడం. స్టేడియంలో సామర్థ్యం కంటే ఎక్కువ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇదంతా చిన్న స్వామి స్టేడియం విషాద సంఘటన చోటు చేసుకోవడంతో 2026 ఐపీఎల్ కి వేదికగా చిన్నస్వామి స్టేడియం ఉండకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ తన హోమ్ గ్రౌండ్ మ్యాచ్ లన్నింటిని పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడాల్సి ఉంటుందని చెబుతున్నారు. తొక్కిసలాట తరువాత చిన్నస్వామి స్టేడియం ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హంగా ప్రకటించబడింది. ఏది ఏమైనప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుతం వార్తల్లో నిలవడం విశేషం.
Also Read : WTC 2027: WTCలో ఇకపై 12 జట్లు…వన్డే సూపర్ లీగ్ వచ్చేస్తోంది..ఇక ఆ పద్ధతికి ఫుల్‌స్టాప్