E-Paper
Advertisement

అవకాడో ఆయిల్ పేరుతో కల్తీ నూనె? ఆరోగ్యం పేరుతో మోసం.. మీరూ కొంటున్నారా?

అవకాడో ఆయిల్ పేరుతో కల్తీ నూనె? ఆరోగ్యం పేరుతో మోసం.. మీరూ కొంటున్నారా?
Advertisement

Fake Avocado oil | అవకాడో ఆయిల్ ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థంగా చాలామంది వినియోగదారుల్లో ఆదరణ పొందింది. ఇప్పుడు చాలా ప్యాకేజ్డ్ ఫుడ్స్ తమ ఉత్పత్తుల్లో అవకాడో ఆయిల్ ఉందని ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి. అవకాడో ఆయిల్ పేరు కనిపిస్తే చాలు వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించేందుకు కూడా సిద్ధపడుతున్నారు. అయితే, ఒక తాజా అధ్యయనం ప్రకారం.. మార్కెట్లో లభించే ప్యాకేజ్ ఉత్పత్తుల్లో అవకాడో ఆయిల్ నిజంగా ఉందా అనే ప్రశ్నలను లేవనెత్తింది.

అవకాడో ఆయిల్‌ ప్రయోజనాలు

అవకాడో ఆయిల్‌ను వంటల్లో అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీన్ని కూరగాయలను వేయించడానికి, రోస్ట్ చేయడానికి, గ్రిల్ చేయడానికి, అలాగే సలాడ్ డ్రెస్సింగ్‌లలో కూడా ఉపయోగపడుతుంది. దీని రుచి.. కూరగాయలు, మాంసాహారం, ధాన్యాలతో బాగా కలిసిపోతుంది. సలాడ్లు, టోస్ట్ లేదా వండిన వంటకాలపై కొద్దిగా అవకాడో ఆయిల్‌ స్ప్రే తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. కొందరు దీన్ని.. మారినేడ్స్, ఇంట్లో తయారు చేసే మయోన్నైస్‌లో కూడా ఉపయోగిస్తారు. మృదువైన ఆకృతి, తటస్థ రుచి కారణంగా బేకింగ్‌లో కూడా అవకాడో ఆయిల్‌ ఉపయోగపడుతుంది.

టెస్ట్‌లో ఫెయిల్ అయిన అవకాడో ఆయిల్ ఫుడ్స్

Advertisement

కాలిఫోర్నియా యూనివర్సిటీ, డేవిస్ పరిశోధకులు అవకాడో ఆయిల్ ఉందని పేర్కొన్న 54 కిరాణా ఉత్పత్తులను పరీక్షించారు. వాటిలో 48 ఉత్పత్తులు, అంటే దాదాపు 89 శాతం, ప్రామాణికత పరీక్షల్లో విఫలమయ్యాయి. పరిశోధకులు ముఖ్యంగా.. బంగాళాదుంప చిప్స్, మయోన్నైస్, సలాడ్ డ్రెస్సింగ్ వంటి ఉత్పత్తులను పరిశీలించారు.

సలాడ్ డ్రెస్సింగ్ శాంపిల్స్ ఫలితాలు మరీ ఆందోళనకరం

పరీక్షించిన ప్రతి సలాడ్ డ్రెస్సింగ్ శాంపిల్ నిజమైన అవకాడో ఆయిల్ కెమికల్ లక్షణాలతో సరిపోలలేదు. అలాగే, దాదాపు 93 శాతం బంగాళాదుంప చిప్స్ నమూనాల్లో కెమికల్స్ కూర్పు భిన్నంగా కనిపించింది. మయోన్నైస్ నమూనాల్లో సుమారు 71 శాతం కూడా పరీక్షలో విఫలమయ్యాయి.

అవకాడో ఆయిల్ బదులు చౌకైన నూనెలు

Advertisement

కొన్ని ఉత్పత్తుల్లో స్వచ్ఛమైన అవకాడో ఆయిల్ బదులు చౌకైన నూనెలు ఉండవచ్చని పరిశోధకులు అనుమానించారు. కొన్ని ఉత్పత్తుల్లో ఇతర వెజిటబుల్ ఆయిల్స్ మిశ్రమం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే, ప్రతి తయారీదారు ఉద్దేశపూర్వకంగా లేబుల్‌పై తప్పుడు సమాచారం ఇచ్చారని అధ్యయనం నిరూపించలేదు.

పరిశోధకులు నూనెల రసాయన లక్షణాలను పరిశీలించారు

పరిశోధకులు పరీక్షించిన నూనెల్లోని ఫ్యాటీ యాసిడ్స్, స్టెరాల్స్ వంటి పదార్థాలను విశ్లేషించారు. ఈ పదార్థాలు నూనె నిజమైనదా కాదా తెలుసుకోవడానికి ఉపయోగపడే రసాయన సంకేతాలు తెలుసుకోవచ్చు. నిజమైన అవకాడో ఆయిల్‌కు ప్రత్యేకమైన రసాయన కూర్పు ఉంటుంది. అయితే, కొన్ని ఉత్పత్తుల్లో ఆ లక్షణాలకు భిన్నమైన రసాయన శాంపిల్స్ కనిపించాయి. ఇతర వెజిటబుల్ ఆయిల్స్‌కు సంబంధించిన కొన్ని పదార్థాలు కూడా ఎక్కువగా కనిపించాయి.

వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి?

అవకాడో ఆయిల్‌కు ఆరోగ్యకరమైన ప్రీమియం ఉత్పత్తి అనే పేరు ఉంది. అందుకే ప్యాకేజింగ్‌పై ఈ పదం కనిపిస్తే వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించే అవకాశం ఉంది. కానీ ఉత్పత్తిలో నిజంగా అదే పదార్థం ఉందని తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే ఇంట్లో దీన్ని పరీక్షించడం సాధ్యం కాదు.

అందువల్ల కొనుగోలు చేసేటప్పుడు పదార్థాల జాబితాను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. విశ్వసనీయమైన థర్డ్ పార్టీ సర్టిఫికేషన్లు అందుబాటులో ఉంటే వాటిని కూడా పరిశీలించాలి.

Also Read: తప్పు చేసినా అంగీకరించరు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈగో, మొండితనం ఎక్కువ

భారత్‌లో కూడా ఫుడ్ లేబుల్స్‌పై పెరుగుతున్న తనిఖీలు

భారతదేశంలో కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనలపై అధికారులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక తప్పుదారి పట్టించే క్లెయిమ్స్‌పై చర్యలు తీసుకుంది.

“100%”, “నేచురల్”, “హెల్తీ”, “హార్ట్-ఫ్రెండ్లీ” వంటి పదాల వినియోగంపై కూడా అధికారులు ప్రశ్నలు లేవనెత్తారు. ఆన్‌లైన్ ఫుడ్ లిస్టింగ్స్‌లో కంపెనీలు పేర్కొన్న వివరాలు ప్యాకేజింగ్‌తో పోల్చినప్పుడు అన్నీ సవ్యంగా ఉండాలని కూడా సూచించారు.

Also Read: మలబద్ధకం సమస్యకు అసలు మూలం ఇదే.. ఈ ఫుడ్స్ తింటే సమస్య ఫినిష్

వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి

ప్యాకేజింగ్‌పై ప్రీమియం పదార్థం పేరు కనిపించడం మాత్రమే దాని నాణ్యతకు హామీ ఇవ్వదు. అందువల్ల భయపడకుండా లేబుల్ వివరాలను పరిశీలించి కొనుగోలు చేయడం మంచిది. అవకాడో ఆయిల్, నేచురల్, హెల్తీ వంటి పదాలను మాత్రమే నమ్మకుండా ఇతర వివరాలను కూడా చూడాలి. ఈ అధ్యయనం ఆహార ప్రామాణికతను మరింత కఠినంగా పరీక్షించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. వినియోగదారులు తాము చెల్లించే ధరకు తగిన నిజమైన పదార్థాలను పొందేలా స్పష్టమైన లేబులింగ్ అవసరం.

Related News

ప్రతి గడపలో ఎదురుచూపు.. ప్రతి మనసులో మైమరుపు.. అనుబంధాల రక్షాబంధన్ వచ్చేసింది!

జలుబు చేసిందా? ఈ ఫుడ్స్ అసలు తినకూడదు..

భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. ఎగ్స్ లేకుండా ప్రొటీన్ ఫుడ్స్ ఇవిగో

మీ తోబుట్టువుల ముఖంలో చిరునవ్వు చిందించేలా..స్పెషల్ రాఖీ విషెస్

తక్కువ ఆహారం తింటున్నప్పటికీ బరువు పెరుగుతున్నారా? ఇదే కారణం

డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? హోంమేడ్ అండర్ ఐ జెల్ ఇలా తయారు చేసుకోండి

చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సెన్సిటివ్

Big Stories

Advertisement
×