Ram Charan RC 17 Movie:ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) .. ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా చేసి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత బుచ్చి బాబు సన (Bucchi babu Sana) దర్శకత్వంలో పెద్ది సినిమా చేసి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ రామ్ చరణ్ తన చేయికి సర్జరీ చేయించుకోవడం వల్ల సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు? ఈ సినిమా పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయని? అభిమానులు ఆశగా ఎదురు చూడగా.. ఇప్పుడు ఫిలిం వర్గాలలో వినిపిస్తున్న వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇకపోతే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలయికలో సినిమా ఖరారు కావడంతో అభిమానులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి . ప్రస్తుతం రామ్ చరణ్ తన చేతికి సర్జరీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సడన్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేశారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం స్థాపించిన కొత్త ఆఫీసులో ఈ సినిమా ప్రారంభోత్సవం చేశారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.
also read:ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!
అయితే ఇలా RC 17 మూవీ గురించి వస్తున్న వార్తలలో అసలు నిజం ఎంత అని ఆరా తీయగా.. అసలు వార్త బయటపడింది . ఈ మేరకు అందుతున్న సమాచారం ప్రకారం ..కొత్త ఆఫీస్ లో జరిగింది సినిమా ఓపెనింగ్ పూజ కాదని , కేవలం ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం మాత్రమేనని స్పష్టమైంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల నిమిత్తం సుకుమార్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించించారట. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా ఈ చిత్రంలో సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా భాగమౌతోంది.. సినిమా గ్రాండ్ ఓపెనింగ్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు ? అనే వివరాలపై త్వరలోనే చిత్రబృందం అధికారికంగా స్పష్టత ఇవ్వనుంది.
మొత్తానికైతే సైలెంట్ గా RC 17 మూవీ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని, అది కేవలం ఆఫీస్ పూజ మాత్రమేనని విశ్వస నీయవర్గాల నుంచి సమాచారం అందుతోంది.