Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో అప్పుడే 5 వారాలు పూర్తయ్యాయి. ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా గట్టిగానే సాగింది. మొత్తం 6 మంది 6వ వారం నామినేషన్ లోకి వచ్చేసారు. ఇక డేంజర్ జోన్ లో ఉన్న వారెవరు అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అమన్, శాలిని, రోహిత్, వంశీ, వర్షిని, రాంప్రసాద్ ఇలా మొత్తం 6 మంది నామినేషన్ లోకి వచ్చేసారు. ఇక ఈ ఆరు మందిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కూడా నెలకొంది.
ఇదిలా ఉండగా మరొకవైపు కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం కంటెస్టెంట్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి కంటెండర్ షిప్ కోసం కంటెస్టెంట్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన వారికి ఈసారి పవర్స్ ఇస్తూ వారినే కెప్టెన్సీ గా అర్హత పొందడానికి కంటెండర్ షిప్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేయమని సూచించారు. ఈ మేరకు తాజాగా 38వ రోజుకు సంబంధించి విడుదల చేసిన రెండవ ప్రోమోలో కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ మధ్య పోటీ గట్టిగానే సాగింది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. “రోడ్ బ్లాక్ అవతారంలో.. వైల్డ్ కార్డ్స్ ను కెప్టెన్సీ కంటెండర్స్ ను చేసి ఈ ఆటను ప్రారంభిస్తున్నాను. గార్డెన్ ఏరియాలో ఒక్కో టీంకు 6 కుర్చీలు ఉంటాయి. వైల్డ్ కార్డు ఎంట్రీస్ కి ఏడు కుర్చీలు ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్లదే పై చేయి. మీరు మూడు టీమ్స్ గా విడిపోయి ఆడాల్సి ఉంటుంది. ఈ ఇంట్లోని కీలకమైన ప్రదేశాలైన బెడ్రూమ్, కిచెన్, లాంజ్, బాత్రూంల కంట్రోల్ ఈ మూడు టీమ్ల చేతుల్లోనే ఉంటుంది. ఆట మొదలయింది. వైల్డ్ కార్డ్స్ కనీసం ఒక్క కుర్చీనైనా కాపాడుకోగలిగితే.. సభ్యులందరూ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు ” అంటూ గేమ్ స్టార్ట్ చేశారు.
also read:ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!
ఇక గేమ్ మొదలవగానే కంటెస్టెంట్స్ , వైల్డ్ కార్డు ఎంట్రీల మధ్య గేమ్ గట్టిగానే సాగింది. ముందుగా కిచెన్ లో ఉన్న ఆహార పదార్థాలను ఒకరికొకరు లాగేసుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా రైసును రోహిత్ బ్యాచ్ తీసుకోవడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ ఆర్కే రామకృష్ణ అందరిదీ కదా మీరు ఎందుకు తీసుకున్నారు అంటూ ఫైర్ అయ్యాడు. అది గేమ్ స్ట్రాటజీ అంటూ రోహిత్, శాలిని రామకృష్ణ తో గొడవ పెట్టుకున్నారు. మరొకవైపు లాంజ్ లో కొంతమంది వైల్డ్ కార్డ్స్ ఇరుక్కుపోవడంతో వీరి కోసం మూడు చైర్స్ అడుగుతున్నారు అని శివ్ చెప్పగా.. శ్వేతా నాయుడు ఒక్క చైర్ కూడా ఇవ్వకండి అంటూ చెప్పింది.
ఇక తర్వాత దొరికిన ఆహారాన్ని ప్రతి ఒక్కరు తినేశారు. రోహిత్ మాట్లాడుతూ.. ఏంటండీ ఇది.. లోపల అందరూ కలిసి తిన్నారు. మళ్లీ బయటకు వచ్చి దొబ్బి తింటున్నారు అంటూ నోరు జారారు. ఇక అమన్ వచ్చి ఎవరు దొబ్బి తింటున్నారు ..నన్ను ఎందుకు అంటున్నావు అంటూ రోహిత్, శాలినితో గొడవ పెట్టుకున్నారు. దొబ్బి తింటున్నామా అని అమన్ అడగగా.. ప్రతి ఒక్కరు పెట్టుకొని తింటున్నారు అంటూ మధ్యలో త్రిగుణ్ సమాధానం చెప్పాడు. నీది కానప్పుడు ఏ హక్కుతో ముట్టుకున్నారు అంటూ రోహిత్ ప్రశ్నించాడు. మీరు తినేది ఏదో తింటున్నారు కనీసం మనుషుల గురించి ఆలోచించరా? అని రోహిత్ అడిగితే మిమ్మల్ని పిలిచాను కదా.. మీకోసమే అక్కడ ఫుడ్ పెట్టాను కదా.. అయినా నువ్వు ఈరోజు ఫాస్టింగ్ కదా.. అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య గొడవ భారీగానే జరిగింది.