E-Paper
Advertisement

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు
Advertisement

Dark mode: స్మార్ట్‌ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా.. ఉండేందుకు రక రకాల ట్రిక్స్ ఫాలో అవుతుంటారు. అందులో.. చాలా మంది గుడ్డిగా నమ్మేది ‘డార్క్ మోడ్’. స్క్రీన్ మొత్తం నల్లగా మారి పోతే బ్యాటరీ కన్జంప్షన్ విపరీతంగా తగ్గిపోతుందని..రోజంతా ఛార్జింగ్ ఉంటుందని భావిస్తుంటారు. అయితే.. టెక్నాలజీ పరంగా చూస్తే ఈ వాదనలో కొన్ని నిజాలు, మరికొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అన్ని ఫోన్లలో.. డార్క్ మోడ్ ఒకేలా పని చేయదు. మీ ఫోన్ డిస్‌ప్లే ఏ రకానికి చెందిందో దాన్ని బట్టి బ్యాటరీ సేవింగ్ ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించిన  వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

AMOLED Vs OLED స్క్రీన్ల మ్యాజిక్:

మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘AMOLED’ లేదా ‘OLED’ డిస్‌ప్లే ఉంటే.. మాత్రం డార్క్ మోడ్ నిజంగానే అద్భుతంగా పని చేస్తుంది. ఈ స్క్రీన్‌ల ప్రత్యేకత ఏంటంటే.. పిక్సెల్స్ నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీతో పని చేస్తాయి. నల్లని రంగు స్క్రీన్ పై వచ్చినప్పుడు ఆ పిక్సెల్స్ పూర్తిగా ‘ఆఫ్’ అయిపోతాయి. అంటే.. ఫోన్ ఎలాంటి పవర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు రాత్రి సమయంలో.. లేదా సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిని డార్క్ మోడ్‌లో వాడినప్పుడు బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది.

LCD స్క్రీన్లపై డార్క్ మోడ్ ప్రభావం ?

Advertisement

అయితే.. మీది బడ్జెట్ ఫోన్ అయిపోయి అందులో ‘LCD’ లేదా ‘IPS LCD’ డిస్‌ప్లే ఉంటే.. మాత్రం డార్క్ మోడ్ వల్ల బ్యాటరీ సేవ్ అవడం కావడం దాదాపుగా శూన్యం అనే చెప్పాలి. ఎందుకంటే.. ఎల్‌సీడీ స్క్రీన్లలో పిక్సెల్స్ వేర్వేరుగా ఆఫ్ కావు. స్క్రీన్ వెనక ఒక పెద్ద ‘బ్యాక్‌ లైట్’ఎప్పుడూ ఆన్ అయి ఉంటుంది. మీరు స్క్రీన్ మీద ఏ కలర్ పెట్టినా.. ఆ బ్యాక్‌ లైట్ నుంచి వెలుతురు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎల్‌సీడీ స్క్రీన్లలో డార్క్ మోడ్ పెట్టినా.. లైట్ మోడ్ పెట్టినా బ్యాటరీ ఖర్చులో పెద్దగా తేడా ఉండదు.

Aso Read: ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

డార్క్ మోడ్ ఎప్పుడు బెస్ట్?

Advertisement

డార్క్ మోడ్ అనేది కేవలం బ్యాటరీ సేవ్ చేయడానికే కాకుండా.. మన కళ్ల ఆరోగ్యం కోసం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా.. రాత్రి పూట లేదా తక్కువ వెలుతురు ఉన్న రూమ్‌లో  ఫోన్ చూస్తున్నప్పుడు డార్క్ మోడ్ ఆన్ చేయడం వల్ల కళ్లపై పడే బ్లూ లైట్ ప్రభావం తగ్గుతుంది. కళ్లకు ఎలాంటి స్ట్రెయిన్ లేదా మంట పుట్టకుండా హాయిగా ఉంటుంది. అలాగే నిద్ర సంబంధిత సమస్య నుంచి కూడా ఇది కొంత వరకు రక్షణ ఇస్తుంది.

మీ ఫోన్‌లో అమెలోడ్ స్క్రీన్ ఉంటే తరచూ డార్క్ మోడ్ వాడటం వల్ల ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. కానీ ఎల్సీడీ స్క్రీన్ ఉన్న వారు బ్యాటరీ కోసం కాకుండా..కళ్ల సౌకర్యం కోసం దీన్ని వాడటం మంచిది.

Related News

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×