Budget Front Load Washing Machine: మీరు ఇప్పటివరకు సెమీ-ఆటోమేటిక్ లేదా టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ వాడుతూ, ఇప్పుడు ఫ్రంట్ లోడ్‌కి అప్‌గ్రేడ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారా ? నిజానికి ఇది చాలా మంచి నిర్ణయం! ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు బట్టలనే చాలా సున్నితంగా, శుభ్రంగా ఉతకడమే కాకుండా.. నీటిని, కరెంట్‌ను కూడా చాలా వరకు ఆదా చేస్తాయి. అయితే.. మార్కెట్‌లో ఉన్న వందల మోడల్స్‌లో బడ్జెట్‌కు తగింది ఎంచుకోవడం కాస్త గందరగోళంగా ఉంటుంది. మొదటిసారి కొనే వారి కోసం రూ.30వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల విభాగంలో.. ఎల్జీ సంస్థకు చెందిన ఈ వాషింగ్ మెషీన్ అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. సుమారు 27,000 రూపాయల బడ్జెట్‌లో లభించే ఈ మోడల్ మూడు నుంచి నలుగురు ఉన్న చిన్న కుటుంబాలకు చాలా బాగా సరి పోతుంది. ఇందులో.. ఉన్న డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ వల్ల మోటార్ నేరుగా డ్రమ్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో వాషింగ్ సమయంలో సౌండ్ ,వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇందులో ఉన్న ఇన్-బిల్ట్ హీటర్, స్టీమ్ వాష్ ఫీచర్లు బట్టలలోని బ్యాక్టీరియాను తొలగించి, బట్టలు చాలా పరిశుభ్రంగా మారుస్తాయి.
మరొక వైపు జర్మన్ ఇంజనీరింగ్ కోరుకునే వారికి ఈ మోడల్ సరైన ప్రత్యామ్నాయం అవుతుంది. ఇది సుమారు 28,000 రూపాయల ధరకు లభిస్తుంది. బాష్ వాషింగ్ మెషీన్లు తమ బలమైన బిల్డ్ క్వాలిటీకి పేరుగాంచాయి. దీనిలోని ఇకో సైలెంట్ డ్రైవ్ మోటార్ తక్కువ కరెంట్ వాడుతూ నిశ్శబ్దంగా పని చేస్తుంది. బట్టలు ఉతికే సమయంలో.. అవి ఒకదానికొకటి మెలికలు పడకుండా బయటకు రావడానికి ఇందులో ఆంటీ-టాంగిల్ అనే ప్రత్యేక ఫీచర్ ఉపయోగపడుతుంది.
టెక్నాలజీ ఇష్టపడే యంగ్ కపుల్స్, స్మార్ట్ హోమ్ ప్రియుల కోసం ఈ మోడల్ మార్కెట్లో సిద్ధంగా ఉంది. దీని ధర సుమారు 29వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ మెషీన్ తన ఇకో బబుల్ టెక్నాలజీ ద్వారా డిటర్జెంట్‌ను నాణ్యమైన నురగగా మార్చి బట్టల పొరల్లోకి త్వరగా తీసుకెళ్తుంది. దీనివల్ల చల్లటి నీళ్లలో కూడా బట్టలు చాలా శుభ్రంగా ఉతుకుతాయి. అంతేకాకుండా స్మార్ట్ థింగ్స్ యాప్ సహాయంతో మీ స్మార్ట్ ఫోన్ నుంచే ఈ మెషీన్‌ను ఈజీగా ఆపరేట్ చేయవచ్చు.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ కాలం వారంటీ , గ్యారెంటీ కోరుకునే వారికి ఈ మోడల్ చక్కటి ఆప్షన్. దీని ధర సుమారు 24,500 రూపాయలుగా ఉంది. బట్టల రకాలు, ప్రధానంగా బోర్ వాటర్ వల్ల వచ్చే హార్డ్ వాటర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఐఎఫ్బీ దీనిని తయారు చేసింది. దీనిలోని ఆక్వా ఎనర్జీ ఫీచర్ కఠినమైన నీటిని కూడా మెత్తగా మార్చి సబ్బు బాగా నురగ వచ్చేలా చేస్తుంది. కంపెనీ ఫ్రీ సర్వీస్‌తో పాటు.. ఏకంగా నాలుగు సంవత్సరాల కాంప్రెహెన్సివ్ వారంటీని అందిస్తుండటం దీని ప్లస్ పాయింట్.
Also Read: రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!
చివరగా పక్కా స్వదేశీ బ్రాండ్ నుంచి సరసమైన ధరలో ఫ్రంట్ లోడ్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనుకునే వారికి ఈ మోడల్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇది సుమారు 25వేల రూపాయల బడ్జెట్‌లో అందుబాటులో.. ఉంటుంది. ఐదు నక్షత్రాల ఎనర్జీ రేటింగ్‌తో వచ్చే ఈ మెషీన్‌లో 1000 RPM స్పిన్ స్పీడ్ ఉంటుంది. ఇది ఉతికిన బట్టలు త్వరగా ఆరడానికి తోడ్పడుతుంది. సాధారణ ఉపయోగం కోసం, తక్కువ బడ్జెట్‌లో మెరుగైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్.
మొత్తానికి మొదటిసారి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు మోటార్ రకం, స్పిన్ స్పీడ్ , మీ కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి. ఇన్వర్టర్ మోటార్ ఉన్న మెషీన్లు కరెంట్ ఆదా చేయడమే కాకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. అదే విధంగా స్టీమ్ వాష్ లాంటి ఫీచర్లు బట్టలపై ఉన్న మురికి , చెడు వాసనను ఈజీగా తొలగిస్తాయి. మీ బడ్జెట్ ,అవసరాలకు తగిన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా ఇంటి లాండ్రీ పనులను మరింత ఈజీ చేసుకోవచ్చు.