E-Paper
Advertisement

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!
Advertisement

Chiranjeevi Kaaka:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా నాలుగు స్తంభాలుగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ , నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముఖ్యంగా ఈ నలుగురిలో ఏ ఒక్క హీరో సినిమా వస్తోందన్నా చాలు థియేటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కి సంబంధించిన వారసులు నటిస్తున్నారు అంటే ఇక ఆ బజ్ సినిమాపై ఏ రేంజ్ లో పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi) మూవీలో బాలయ్య (Balakrishna) కూతురు తేజస్విని (Tejaswini) నటిస్తోంది అంటూ వార్తలు రాగా.. ఆ వార్తలపై బాలయ్య అల్లుడు సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిరంజీవి కాకా సినిమాలో బాలయ్య కూతురు..

అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో మళ్లీ సంక్రాంతి టార్గెట్గా ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఈ కాంబినేషన్ మళ్ళీ సంక్రాంతిని టార్గెట్గా చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అనస్వర రాజన్ చిరంజీవికి కూతురుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

స్పందించిన తేజస్విని భర్త..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు వైజాగ్ ఎంపీ భరత్ అలియాస్ నందమూరి బాలకృష్ణ అల్లుడు తేజస్విని భర్త ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..” మెగాస్టార్ చిరంజీవి కాకా సినిమాలో తేజస్విని కోసం అప్రోచ్ అయ్యారని తెలిసింది.. నిజమేనా ?”అన్న ప్రశ్నకు తనదైన సమాధానమిచ్చారు భరత్. చిరంజీవి గారి కాకా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారట నిజమేనా? అని ప్రశ్నించగా.. బాబి గారైతే బాగా తెలుసు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి గారి కాకా మూవీలో మేము నటించాలనుకున్న కీలక పాత్ర అయితే లేదు అని భరత్ తెలిపారు. మరి నిజంగానే అప్రోచ్ అయ్యారా? ఏదైనా పాత్ర కోసం అడిగారా? అని యాంకర్ ప్రశ్నించగా… అది తేజస్విని – బాబి మధ్య ఉంటుంది. అయితే నేను ఈ విషయంపై బాబీని అడగాలి అనుకోవట్లేదు. పైగా ఇక్కడ చెప్పాలని కూడా అనుకోవట్లేదు.. కానీ ఒకవేళ తాను నటిస్తాను అంటే నేను సపోర్ట్ చేస్తాను అంటూ తెలిపారు భరత్.

also read:పవన్ తో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి!

నిజమైతే.. కాకా మూవీకి కలెక్షన్ల వర్షం..

Advertisement

మొత్తానికి అయితే కాకా సినిమాలో తేజస్విని రోల్ గురించి భరత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఒకవేళ నిజంగానే చిరంజీవి సినిమా కోసం తేజస్వినినీ బాబీ అప్రోచ్ అయి ఉండుంటే, పాత్ర నచ్చి ఆమె ఒప్పుకొని నటిస్తే మాత్రం సినిమాపై బజ్ మరింత పెరిగిపోతుంది. ముఖ్యంగా చిరంజీవి అభిమానులే కాదు నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాను బాగా ఆదరిస్తారు అనడంలో సందేహం లేదు.. ఒకవేళ ఈ సినిమాలో ఆమె నటించి,తన పాత్రతో న్యాయం చేయగలిగింది అంటే తదుపరి అవకాశాలు మెండుగా ఉంటాయనడంలో కూడా సందేహం లేదు.. మరి అసలు విషయం ఏమిటో తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సిందే. కానీ నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా ద్వారా తేజస్విని నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు

Related News

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!

‘ఏందయ్యా సామి’ తర్వాత ‘కోబలి’.. ఈసారి రచ్చ మామూలుగా లేదుగా !

మాస్ మహారాజా కూతురు అదుర్స్…. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో !

రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!

చిరు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పిన ఆ హీరో ఎవరో తెలుసా?

కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్.. ప్రమాదానికి గురైన శ్రీకాంత్ అయ్యంగార్.. పునర్జన్మ అంటూ!

పవన్ పని తీరుపై ప్రశంసలు కురిపించిన చిరు… నెం.1 స్థానంలో ఏపీ!

Big Stories

Advertisement
×