E-Paper
Advertisement

పవన్ తో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి!

పవన్ తో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన రీతూ చౌదరి!
Advertisement

Rithu Chowdary: రీతూ చౌదరి (Rithu Chowdary).. సోషల్ మీడియా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మరింత ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ తనదైన పర్ఫామెన్స్ తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో అందరి దృష్టిని ఆకర్షించింది రీతూ చౌదరి. ఇక అలాంటి రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే షోలో తనతో పాటు పార్టిసిపేట్ చేసిన కామనర్ డెమోన్ పవన్ తో కాస్త చనువుగా ఉన్న విషయం తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చనువు మెయింటైన్ చేయడంతో నిజంగానే ప్రేమలో ఉన్నారా? అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి.

కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి..

దీనికి తోడు వీళ్లిద్దరూ కలిసి ‘బంగారం’ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేయడం కూడా వైరల్ గా మారింది. అందరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ అనుకున్న సమయంలో సడన్గా డెమోన్.. రీతూ చౌదరి తనను బ్లాక్ చేసింది అంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పవన్, రీతూ చౌదరి మధ్య బ్రేక్అప్ జరిగిందా అనే అనుమానాలకు కూడా పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై స్పందించిన రీతు చౌదరి మీరంతా ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా అనే రేంజ్ లో విరుచుకుపడింది. అయితే ఇప్పుడు తాజాగా పవన్ తో బ్రేకప్ పై స్పందించి కన్నీళ్లు పెట్టుకుంది.

లవ్లో బ్రేకప్ అంటే.. ఫ్రెండ్షిప్ లో బ్రేకప్ చాలా కష్టం..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా చెఫ్ మంత్ర ప్రాజెక్టు -కే సీజన్ 6 లో పాల్గొన్న రీతు చౌదరి ఎన్నో విషయాలు పంచుకుంది. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఈ ఎపిసోడ్ కి ప్రముఖ హీరో శ్రీ విష్ణు తన మూవీ కామ్రేడ్ కళ్యాణ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15న ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో రీతు చౌదరి మాట్లాడుతూ… “ఒక రిలేషన్షిప్ లో బ్రేకప్ కంటే ఫ్రెండ్షిప్ లో బ్రేకప్ చాలా బాధగా ఉంటుంది. ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్లే ఒక సింపతి కార్డు ప్లే చేస్తే కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది.. వందసార్లు ఒక అబ్బాయి కోసం స్టాండ్ తీసుకొని , 100 మంది ముందు మాట్లాడినప్పుడు మాత్రం ఒక్కటి కూడా కనిపియ్యదు. కానీ చిన్న మిస్టేక్ జరిగితే ఆ అమ్మాయిదే తప్పు.. ఆ అమ్మాయి అది అంటారు” అంటూ రీతూ చౌదరి కామెంట్ చేసింది.

also read: సాయి పల్లవిని చంపేయాలనుకున్నా..అనుపమ షాకింగ్ కామెంట్స్!

జనాల మాటలకు ఎఫెక్ట్ అవుతాం..

Advertisement

దీనికి డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ..” జనాలు ఏం మాట్లాడుకున్నా నువ్వు ఎఫెక్ట్ అవుతావా ?” అని ప్రశ్నించగా.. “కచ్చితంగా అవుతాను.. ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే కదా.. దానికంటే ఎక్కువ బాధ నాకు దీనికే వచ్చింది.. రాత్రిళ్ళు కూడా నిద్ర పట్టలేదు ” అంటూ తన అనుభవాలను పంచుకుంది రీతూ చౌదరి.. ఇక మధ్యలో సుమ మాట్లాడుతూ.. కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయి అని సుమా చెబుతుండగా రీతు చౌదరి మాట్లాడుతూ నేను స్ట్రాంగ్ గర్ల్ గా ఉండడంలో అలసిపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ..మొత్తానికైతే రీతూ చౌదరి పవన్ తో ఫ్రెండ్షిప్ లో బ్రేకప్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే ఆమె పవన్ పేరు ప్రస్తావించకపోయినా అసలు మ్యాటర్ ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

ఒక్కో ఈవెంట్‌కు లక్షల్లో పారితోషికం.. స్టార్ యాంకర్ల రేంజే వేరు!

బతుకమ్మ పాటలంటే మంగ్లీ తర్వాతే ఎవరైనా.. మరోసారి నిరూపించిందిగా!

బిగ్ బాస్ ను గౌరవించమని చెప్పిన కౌశల్.. వేలల్లో తగ్గిపోయిన ఫాలోవర్స్!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?

బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. చరణ్, అపూర్వ ఔట్!

ఆ నలుగురి బండారం బయటపెట్టిన అపూర్వ.. వీడియో వైరల్!

Podarillu Today Episode : కన్నా ఫుల్ హ్యాపీ.. నారాయణ కన్నీళ్లు.. మహా వెళ్ళిపోతుందా..?

Big Stories

Advertisement
×