Irumudi Movie:సాధారణంగా ఒక సినిమా విడుదలయ్యేటప్పుడు.. ఆ సినిమాకి పోటీగా వేరే చిత్రాలు ఉన్నాయా? లేదా? ఉంటే వాటి కెపాసిటీ ఎంత? ఇలాంటి తదితర అంశాలు మేకర్స్ ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒకేసారి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీలు గనుక బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే మాత్రం కలెక్షన్లు వసూలు చేయడంలో నష్టం ఎదుర్కోక తప్పదు. అంతేకాదు కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో సినిమాలు రిలీజ్ కి ఉన్నా కూడా ముందు విడుదల చేసిన సినిమా కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ పడుతుంది అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇప్పుడు ఇరుముడి (irumudi ) మూవీ విషయంలో అదే జరుగుతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇరుముడి సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చి మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారం వ్యవధిలోనే అనగా ఆగస్టు 26న టాక్సిక్(Toxic ) సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇరుముడి మూవీకి థియేటర్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (DilRaju) దక్కించుకున్నారు. దీంతో ఇరుముడి సినిమా నడుస్తున్న అన్ని థియేటర్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏషియన్ థియేటర్లలో టాక్సిక్ చిత్రమే స్క్రీనింగ్ కానుంది . ఫలితంగా ఇరుముడికి కలెక్షన్లు తగ్గే అవకాశం కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ:అడ్వాన్స్ బుకింగ్స్ లో టాక్సిక్ సరికొత్త రికార్డు.. ‘A’ వచ్చినా డోంట్ కేర్!
ఇదే సమయంలో మరి కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు టాక్సిక్ మూవీ నుండి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పైగా సెన్సార్ కూడా ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండే ఈ సినిమా ఒకవేళ నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం మళ్లీ ఇరుముడి పుంజుకునే అవకాశం ఉంది అని కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఇరుముడి సినిమాకి టాక్సిక్ మూవీ పెద్ద తలనొప్పిగా మారింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ (Raviteja) తొలిసారి జానర్ మార్చి ఫ్యామిలీ ఎమోషనల్, యాక్షన్ క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో ఇరుముడి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. అంతేకాదు మరొకవైపు కలెక్షన్లు కూడా బాగానే లభిస్తున్నాయి.
ఇక ఇప్పుడు యశ్ ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో టాక్సిక్ మూవీని విడుదల చేస్తున్నారు.. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. నయనతార , తారా సుతారియా , హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఇరుముడి మూవీ కలెక్షన్స్ కి అడ్డుకట్ట వేస్తుందా అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఆగస్టు 26 వరకు ఎదురు చూడాల్సిందే.