E-Paper
Advertisement

ప్రథమార్ధంలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసిన తెలుగు చిత్రాలు!

ప్రథమార్ధంలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసిన తెలుగు చిత్రాలు!
Advertisement

Tollywood 2026: ఈ ఏడాది ప్రథమార్ధం టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఒక విభిన్నమైన అనుభూతిని అందించింది. సంక్రాంతితో అదిరిపోయే బోణీ కొట్టిన తెలుగు చిత్రసీమకు, సమ్మర్ సీజన్ కాస్త నిరాశపరిచినా.. జూన్, జూలై, ఆగస్టు నెలలు మళ్లీ మునుపటి జోరును తీసుకొచ్చాయి. ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు, బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించిన చిత్రాలు, యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్న సినిమాలేంటో 2026 ఫస్టాఫ్ రిపోర్ట్‌పై ఓ లుక్ వేద్దాం..

సంక్రాంతి ధమాకా.. హిట్ల వర్షం:

ఈ ఏడాది జనవరి సంక్రాంతి పండగ బాక్సాఫీస్ వద్ద నిజమైన వినోదాల విందు పంచింది. ప్రభాస్ ‘రాజా సాబ్’ డిజాస్టర్ గా నిలిచినప్పటికీ బాగానే కలెక్షన్లు అందుకుంది. అటు చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్’ చిత్రం ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలవగా.. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి పర్వాలేదనిపించుకుంది . వీటితో పాటు నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచి ప్రథమార్ధానికి శుభారంభాన్ని ఇచ్చాయి.

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్.. కాస్త సప్పగా!:

Advertisement

సంక్రాంతి హడావిడి ముగిసాక ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొన్ని సినిమాలు మాత్రమే నిలదొక్కుకున్నాయి. సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’, సుహాస్ ‘హే బలవంత్’, శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ చిత్రాలు ఓ మోస్తరు విజయాన్ని సాధించగా.. మార్చిలో వచ్చిన ‘మృత్యుంజయ’, ‘సరస్వతి’, ‘సతి లీలావతి’ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకున్నాయి. ఇక ఏప్రిల్, మే వేసవి సీజన్ సైతం ‘గాయపడ్డ సింహం’, ‘జెట్లీ’ వంటి చిత్రాలు సరైన ప్రభావం చూపలేకపోవడంతో కాస్త నిరాశపరిచింది.

జూన్, జూలైలో పుంజుకున్న బాక్సాఫీస్:

సమ్మర్ గ్యాప్ తర్వాత జూన్ నెల టాలీవుడ్‌కు మళ్లీ ప్రాణం పోసింది. రామ్ చరణ్ ‘పెద్ది’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. జూలైలో అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం జూలై 10న విడుదలై ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందించింది. ఇక దీంతో పాటు ‘రావు బహాదుర్’, ‘నాగ బంధం’ చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరించి ఓ మోస్తరు వసూళ్లను రాబట్టాయి.

Advertisement

also read: ఇమ్మాన్యుయేల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్.. అసలేం జరిగిందంటే?

ఇక ఆగస్టు నెల మూవీ లవర్స్‌కు నిజమైన పండగలా మారింది. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు హారర్ కామెడీతో హిట్ కొట్టగా, సూర్య ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ రికార్డు కలెక్షన్లు సాధించింది. తాజాగా విడుదలైన రవితేజ ‘ఇరుముడి’ కూడా సూపర్ హిట్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. మొత్తానికి 2026 ప్రథమార్ధం కొన్ని హెచ్చుతగ్గులతో సాగినా, ఆగస్టు నాటికి టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంది..

Related News

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

Big Stories

Advertisement
×