E-Paper
Advertisement

మళ్లీ మొదలైన స్పిరిట్ వివాదం.. లాభాల్లో వాటాపై దీపిక కౌంటర్!

మళ్లీ మొదలైన స్పిరిట్ వివాదం.. లాభాల్లో వాటాపై దీపిక కౌంటర్!
Advertisement

Deepika Padukone: చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యతపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది నటీమణులు ఇండస్ట్రీలో ముఖ్యంగా పురుషులు, మహిళల మధ్య తేడా చూపిస్తున్నారని అది స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అటు దీపికా పదుకొనే (Deepika Padukone) కూడా ఇదే వివాదాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా స్పిరిట్ (Spirit) సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన దీపికా పదుకొనేను ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) ఎంపిక చేసుకున్నారని, అయితే ఆమె పని దినాలలో కండిషన్ పెట్టడం, రెమ్యూనరేషన్ అత్యధికంగా అడగడం వల్ల ఆమెను సినిమా నుండి తప్పించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సందీప్ రెడ్డివంగా ఇటు దీపికా పదుకొనే టీం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేసిన విషయం తెలిసిందే.

దీపికాను తప్పించడం పై ప్రణయ్ కామెంట్.. ఆమె ఏమన్నారంటే?

తర్వాత దీపికా పదుకొనే గ్లోబల్ ఈవెంట్లలో సందడి చేస్తూ తన స్టేటస్ ను మరోసారి నిరూపించింది. అదే టైమ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు దీపికాకు మద్దతు కూడా పలికారు. ఇక ఈ వివాదం సద్దుమణిగింది అనుకునే లోపే ఈ విషయంపై మరోసారి ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy vanga) స్పందించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో నటించడానికి పనిగంటలలో కండిషన్ తో పాటు లాభాల్లో 10% వాటా డిమాండ్ చేసింది. మేము దీనికి ఒప్పుకోకపోవడంతో ఆమె కంటెంట్ను కావాలనే లీక్ చేసింది.దీంతో సందీప్ రెడ్డివంగా ఆగ్రహం వ్యక్తం చేసి , ఆమెను ప్రాజెక్ట్ నుండి తొలగించాడు అంటూ ప్రణయ్ వెల్లడించాడు.

దీపికా పదుకొనే పరోక్షంగా కౌంటర్..

Advertisement

గతంలో తనను విమర్శించిన సందీప్ రెడ్డి వంగాకి గట్టి షాక్ ఇస్తూ ఎలాగైతే ఆమె పీ .ఆర్ . టీమ్ ద్వారా స్పిరిట్ సినిమా స్టోరీ లైన్ ను బాలీవుడ్ మీడియాకు లీక్ చేసిందో.. ఇప్పుడు కూడా అదే విధంగా నేరుగా కాకుండా పరోక్షంగా రియాక్ట్ అయ్యింది. ఈ విషయంపై పురుషాధిక్యతపై ఒక జర్నలిస్టు తన ఇంస్టాగ్రామ్ లో రాసిన సుదీర్ఘ పోస్టుకు దీపికా పదుకొనే లైక్ కొట్టింది. అలా పరోక్షంగా స్పిరిట్ నిర్మాత వాదనను ఆమె ఖండించింది . పురుష నటులు ఇలాంటి డిమాండ్లు చేయడం సాధారణమని.. ఒక నటి వాటా అడిగితే ఇండస్ట్రీలో రాద్ధాంతం చేయడం పై ఆ జర్నలిస్టు ప్రశ్నించారు. ఇక ఇలాంటి పోస్ట్ కి దీపిక లైక్ కొట్టింది. ఇలా స్పిరిట్ లాభాలలో తను వాటా అడిగిన మాట వాస్తవమేనని ఆమె పరోక్షంగా అంగీకరించినట్లు అయిందంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సమస్య సర్దుమనిగింది అనుకున్నా..సమస్య మళ్లీ తెరపై ప్రత్యక్షమవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

also read: టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి.. కూలిన సౌండ్ స్పీకర్.. గాయపడ్డ విద్యార్థులు!

దీపికా పదుకొనే సినిమాలు..

Advertisement

ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న ‘రాకా’ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. అలాగే మరికొన్ని చిత్రాలలో దీపికా భాగమైన విషయం తెలిసిందే . ఇకపోతే ఈ సినిమా కోసం సుమారుగా 20 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Related News

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

Big Stories

Advertisement
×