E-Paper
Advertisement

NBK111.. మాస్ జాతరకు డేట్ ఫిక్స్!

NBK111.. మాస్ జాతరకు డేట్ ఫిక్స్!
Advertisement

NBK111 Release:వీర సింహ రెడ్డి కాంబో నేషన్ మరోసారి సినిమా వస్తుందని అన్న వార్త రాగానే మురిసిపోయారు నందమూరి అభిమానులు.గోపీచంద్ మలినేని, బాలయ్య జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుందని ఆశ పడిపోయారు.ఇక సినిమా కూడా జోరుగా మొదలైపోయింది.

అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అది సినిమా ఎందుకవుతుంది.కాకినాడ పోర్ట్ లో బాలయ్య కాలు ఇంజ్యూర్ కావడంతో మోకాలికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి.దీంతో ఇక సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కష్టమే అనుకున్నారంతా.

డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్

Advertisement

కానీ అభిమానులని ఎక్కడా నిరాశపరచమంటూ ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.మొత్తానికి సర్జరీ తరువాత బాలయ్య వేగంగా కోలుకుని ఈ సినిమాలో పాల్గొనబోతున్నాడన్న మాట.

also read :వందకోట్ల ‘ఇరుముడి’?– ఇదీ రవితేజ స్టామినా !

Advertisement

అంటే వచ్చే మూడు నెలల్లో సినిమాని చక చక కంప్లీట్ చేసి డిసెంబర్ నాటికి బరిలో దించబోతున్నారన్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే అభిమానులకి మాటిచ్చిన ప్రకారం సినిమాని ఆన్ టైమ్ కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న బాలయ్యని మెచ్చుకుని తీరాల్సిందే.

బాలయ్య ,మంచు మనోజ్ ల మధ్య వచ్చే సీన్స్

ఇక పెద్ది సినిమాని ఎలాగైతే భారీ బడ్జెట్ తో ఎక్కడా తగ్గకుండా నిర్మించారో ఈ సినిమాని కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిర్మిస్తుందట వృద్ది సినిమాస్.ఇక వీర సింహ రెడ్డి వంటి సాలిడ్ మాస్ ఎంటర్ టైనర్ అందించిన గోపీచంద్ మలినేని ఈ సినిమాలో కూడా అంతకు మించిన పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ లని ప్లాన్ చేశాడట. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య ,మంచు మనోజ్ ల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని ఇన్ సైడ్ టాక్.

బాక్సాఫీస్ ఇక  డబిడి దిబిడే

ఇకవాటితో అదే మోతాదులో ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా మిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ఇక సినిమాకి తగ్గట్టుగా నే మాస్ ఆడియన్స్ కి పూనకలు తెప్పించే సాంగ్స్ తో పాటు అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సిద్దం చేస్తున్నాడట నందమూరి తమన్.

also read :ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?

మొత్తంగా డిసెంబర్ 24 అంటే క్రిస్మస్ హాలిడేస్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ డేట్ పై ఫోకస్ పెట్టారని అర్థం అయిపోతుంది అసలే హాలీడేస్ , ఆపై అంచనాలు భారీగా మోస్తున్న బాలయ్య సినిమా. ఇంకేం కావాలి బాక్సాఫీస్ ని డబిడి దిబిడి చేయడానికి !

Tags

Related News

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

Big Stories

Advertisement
×