BIGG BOSS 2: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిగిలిన 9 సీజన్ల కంటే ఈ పదవ సీజన్ విపరీతంగా ఆడియన్స్ ను అలరిస్తోంది. ప్రతి సీజన్ రెండో వారంలో లేదా ఐదవ వారంలో ఆడియన్స్ లో మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ ఈ సీజన్ మొదటి వారం నుంచే ఆడియన్స్ లో సరికొత్త క్యూరియాసిటీని రేకెత్తిస్తూ ఉండడం గమనార్హం. కనీ వినీ ఎరుగని రీతిలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఫిజికల్ ఛాలెంజ్ లు , నాగార్జున కోటింగ్ ఇవ్వడం, ఎల్లో కార్డు, రెడ్ కార్డు ఇలా ఒక్కటేమిటి ఎన్నో సంఘటనలు ఈ సీజన్ ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ముఖ్యంగా మొదటి వారమే డబుల్ ఎలిమినేషన్ పేరిట ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం, ఆ తర్వాత ఒకరిని హౌస్ లోకి తీసుకోవడం, ఇక బిగ్ బాస్ ఫినాలే కి ముందు బిగ్ బాస్ సూట్ కేస్ ఆఫర్ ను హౌస్ లోకి తీసుకొచ్చేవారు. కానీ మూడవ వారమే సూట్ కేస్ ఆఫర్ రావడం, అందులోనూ వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన కామనర్ మిథిలేష్ రెడ్డి 15 లక్షల సూట్కేస్ ఆఫర్ తీసుకొని బయటకు వెళ్లిపోవడం.. ఇలా ఒక్కటేమిటి ఎవరూ ఎరుగని రీతిలో అన్నీ ట్విస్టులే. దీనికి తోడు ఒకవైపు అమ్మాయిలు ఫిమేల్ కార్డ్ వాడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. మరొకవైపు నాగార్జున గతవారం ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్స్ కి ఎల్లో కార్డు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు తనదైన ఆట తీరుతో ఆకట్టుకోవాలని చూస్తున్న రోహిత్ నాయుడుని ఏకంగా గెట్ అవుట్ అంటూ చేసిన కామెంట్లు కూడా షోపై ఆసక్తిని కలిగించాయి.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆదరణ బాగా పెరిగిపోతున్న క్రమంలో టీవీ వ్యూయర్ షిప్ తో పాటు హాట్ స్టార్ లో కూడా వ్యూస్ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.. బిగ్ బాస్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఈ బిగ్ బాస్ సీజన్ 10 కి అనూహ్యమైన వ్యూస్ లభించాయి. షో ప్రారంభం అనగా సెప్టెంబర్ 6 నుండి అక్టోబర్ 8 మధ్య నెల రోజుల్లో ఏకంగా 8 కోట్ల 20 లక్షల మందికిపైగా ఈ షో వీక్షించారు. షో పూర్తయ్యే సమయానికి సుమారుగా 20 కోట్ల వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ రేంజ్ వ్యూస్ ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో మరే సీజన్ కి కూడా రాలేదని చెబుతున్నారు. అటు తెలుగుతో పాటు తమిళ్, హిందీ ,కన్నడ , మలయాళం భాషల్లో కూడా ఒకేసారి ఈ షో కొత్త సీజన్ ఈ ఏడాది మొదలైంది. అన్ని భాషల కంటే కూడా తెలుగు బిగ్ బాస్ కి ఎక్కువ.వ్యూస్ వచ్చాయి. పైగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత ఈ సీజన్ రేంజ్ ఎక్కడికి వెళ్తుందో అనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొంది.
ALSO READ: స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?
ఇక ఈవారం ఏడు మంది నామినేషన్స్ లోకి రాగా.. అపూర్వ, చరణ్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.