Jagapati Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ఒకరు. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన జగపతిబాబు ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో(Villain Roles) నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే హీరోగా కంటే విలన్ పాత్రల ద్వారానే జగపతిబాబు మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకోవటమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు.
హోస్ట్ గా మారిన జగపతిబాబు…
ఇలా సినిమాల ద్వారా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న జగపతిబాబు జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జీ తెలుగులో ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమానికి జగపతి బాబు హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు హాజరవుతూ సందడి చేయబోతున్నారు. మొదటి ఎపిసోడ్ లో భాగంగా కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.. అయితే తాజాగా ప్రేమించుకుందాం రండి అంటూ ఒక వీడియోని విడుదల చేశారు.
అంతపురం క్లైమాక్స్ ఎప్పటికీ మర్చిపోలేను…
ఈ వీడియోలో భాగంగా అభిమానులు చేసిన కామెంట్లకు ఈయన రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ఒక అభిమాని తెలుగు సినిమాలు చాలా బోరింగ్ అంటూ కామెంట్ చేయడంతో అలాంటప్పుడు ఎందుకు కూర్చొని సినిమాలు చూడటం అంటూ జగపతిబాబు తనదైన శైలిలోనే రిప్లై ఇచ్చారు. అలాగే నెపోటిజం గురించి, క్యాస్ట్ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇక ఇందులో భాగంగా ఏకంగా ఒక అభిమానికి జగపతిబాబు ఫోన్ చేసి మాట్లాడటం విశేషం. అయితే ఒక అభిమాని మాత్రం జగపతిబాబు హీరోగా నటించిన అంతఃపురం సినిమా క్లైమాక్స్ గురించి కామెంట్ చేయడంతో జగపతిబాబు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
?igsh=MTBwcDAwdHk2amp1cg%3D%3D
తన సినీ కెరియర్ లోనే ఈ సినిమా క్లైమాక్స్ ఎప్పటికీ మర్చిపోలేనిదని తెలిపారు. ఇక ఈ క్లైమాక్స్ సమయంలో డైరెక్టర్ కృష్ణవంశీ ఎంతసేపటికి కట్ చెప్పకుండా ఉండిపోయారు. దీంతో నా ప్రాణాలు పోయాయి ఆల్మోస్ట్ సచ్చిపోయాను అనుకున్నాను. అంతలా డైరెక్టర్ ఆ సీన్ లో లీనం అవుతూ.. కట్ చెప్పడం మర్చిపోయారని ఈ సందర్భంగా జగపతిబాబు ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక జగపతిబాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా (Peddi Movie)షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని పలు సందర్భాలలో వెల్లడించారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలో షూటింగ్ పనులలో జగపతిబాబు ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Rahul Sipligunj : కళాకారుడిగా ఇది గర్వ కారణం… రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ పోస్ట్!