BigTV English

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా తయారు చేస్తారా? అస్సలు ఊహించి ఉండరు!

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా తయారు చేస్తారా? అస్సలు ఊహించి ఉండరు!

Cinnamon Tree: విందు ఏదైనా ఆహారంలో దాల్చిన చెక్క వేయాల్సిందే. వంటకంలో దాల్చిన చెక్క పడిందంటే.. ఘుమ ఘుమలు రావాల్సిందే. వంటకాల్లో వేసే ఈ దాల్చిన చెక్కను చెట్టు బెరడు నుంచి తీస్తారని తెలుసు. కానీ, ఎలా తీస్తారు అనేది తెలియదు. దాల్చిన అనేది ఉష్ణమండల చెట్ల బెరడు నుండి తయారవుతుంది. దాల్చిన చెక్క చెట్టు బెరడు నుంచి తీస్తారు. ఈ బెరడు కొన్ని సెంటీ మీటర్ల మందంతో ఉంటుంది. దీన్ని చెట్టు నుంచి తీయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మందం ఎక్కువగా ఉంటూ, పచ్చిగా ఉండటంతో బరువు ఎక్కువగా ఉంటుంది. ఈ బెరడును చెట్టు నుంచి మోసుకురావడానికి చాలా మంది అవసరం పడుతుంది.


దాల్చిన చెక్క తయారీ విధానం

దాల్చిన చెక్క తయారీకి, సిలోన్, కాసియా రకాల చెట్లను ఎంచుకుంటారు. చెట్టు బెరడు లోపలి పొరను జాగ్రత్తగా తీస్తారు. ఇది దాల్చిన చెక్క ప్రధాన భాగం. తీసిన బెరడును ఎండలో లేదంటే పొడి ప్రదేశంలో ఎండబెడతారు. ఎండిన బెరడును దాల్చిన చెక్క కర్రలుగా చుట్టి లేదంటే పొడిగా మార్చడానికి మిక్సీలో వేసి రుబ్బుతారు. సాధారణంగా, రెండు రకాల దాల్చిన చెక్కలు ఉంటాయి. ఒకటి సిలోన్ కాగా, మరొకటి కాసియా. కిరాణా దుకాణాలలో సాధారణంగా కనిపించేది కాసియా. సిలోన్ దాల్చిన చెక్క శ్రీలంకలో పెరుగుతుంది. మన దగ్గర అంతగా దొరకదు.


దాల్చిన చెక్కతో బోలెడె ప్రయోజనాలు

దాల్చిన చెక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెక్క బోలెడు పోషకాలను కలిగి ఉంటుంది. దాల్చిన చెక్కలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగపడుతుంది.దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క సహజ కామోద్దీపనగా పనిచేస్తుంది. లైంగిక కోరికను పెంచడంలో సహాయపడుతుం. దాల్చిన చెక్కలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, వాటిని నివారించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క వేసిన నీరు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Read Also:  ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

దాల్చిన చెక్క వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అధిక మోతాదులో దాల్చిన చెక్క తీసుకుంటే దుష్ప్రభావాలకు కారణం కావచ్చు.గర్భధారణ సమయంలో, తల్లిపాలు ఇస్తున్నప్పుడు దాల్చిన చెక్కను వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. కొంతమంది వ్యక్తులకు దాల్చిన చెక్క పట్ల అలెర్జీ ఉండవచ్చు. అలాంటి వారు జాగ్రత్తగా వాడాలి.

Read Also:  సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Related News

Virus to Rabbits: కుందేళ్లకు కొమ్ములా.. బాబోయ్ ఇదెక్కడి విడ్డూరం?

Loco pilot Viral Video: క్షణం ఆగి జెండాకు సెల్యూట్.. లోకో పైలట్ వీడియో వైరల్!

Maneka Gandhi Sister: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Dogs Day Celebrations: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

Viral video: బస్సును నడుపుతున్న యువతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Big Stories

×