E-Paper
Advertisement

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!
Advertisement

Jailer 2 Ticket Prices:పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్రతీసారి సోషల్ మీడియాలో టికెట్ ధరలపై డిస్కషన్స్ హాట్ హాట్ గా జరగడం మనం చూస్తూనే ఉంటాం,ఇదిగో తాజాగా అలాంటి డిబేటే ఇపుడు మరోసారి మొదలైంది.ముఖ్యంగా ఈ డిబేట్ లలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగ వంశీ అలాగే పవర్ స్టార్ ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్రోల్స్ చేయడం ఇక్కడ గమనార్హం.

అక్టోబర్ 15న రిలీజ్

Advertisement

విషయంలోకి వెళ్తే జైలర్ హక్కులని నాగ వంశీ ఫ్యాన్సీ రేట్ (40 కోట్లని బయట టాక్)కి దక్కించుకున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ కానుండటంతో సినిమా టికెట్ రేట్లు పెంచబోతున్నారన్న వార్త మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

దీంతో చెన్నైలో సినిమా టికెట్ రూ.150కే దొరుకుతుంటే, మన దగ్గర మాత్రం ఎందుకింత బాదుడు అంటూ ఓ నెటిజన్ నాగ వంశీపై మండిపడ్డాడు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా టికెట్ రేట్లను రూ.50, రూ.75 చొప్పున పెంచుకుంటూ పోతున్నారని ఫైర్ అయ్యాడు.

Advertisement

నష్టాలు వస్తేనే కానీ నాగ వంశీకి బుద్ది వచ్చేలా లేదు 

సినిమా చూడాలని ఆశపడే కామన్ మ్యాన్ కి ఈ ధరలు గుదిబండలా మారాయని వాపోయాడు.ఒక నెటిజన్ మరో అడుగు వేసి సినిమాకు నష్టాలు వస్తేనే కానీ నాగ వంశీకి బుద్ది వచ్చేలా లేదని ఘాటుగా కామెంట్స్ చేశాడు.

ప్రేక్షకులే సినిమాలను ఆదరిస్తే నిర్మాతలకు లాభాలు వస్తాయని, అలాంటప్పుడు అదే ప్రేక్షకులపై పదేపదే అదనపు భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడం ఒక ఎత్తయితే, వాటిని ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లో చూపించడం కూడా ముఖ్యమేనని చెప్పుకొచ్చారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు

మరోవైపు సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వాలపైనా విమర్శలు చేయడం ఇక్కడ గమనార్హం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని, ఈ విషయంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ యాక్షన్ తీసుకోవాలని తెలిపారు.

ఇక మరో వైపు జైలర్ 2 కి ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ 16న రణబాలి రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా టికెట్ రేట్లతో పోలుస్తున్నారు నెటిజన్లు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమా రేట్లు ఏమాత్రం పెంచట్లేదని,కాని పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడు సినిమాకి అంతంత రేట్లు పెట్టడం ఎందుకని వాపోయారు.

ALSO READ :ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

మొత్తానికి టాలీవుడ్ లో మరోసారి టికెట్ రేట్ల అంశం ఇపుడు మరోసారి వార్తల్లో నిలిచింది.చూడాలి మరి జైలర్ 2 హైక్స్ పై సోషల్ మీడియా వస్తున్న కామెంట్స్ కి డిస్ట్రిబ్యూటర్ నాగ వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో !

Tags

Related News

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

పిల్లలు పుట్టే వరకు వాటిని పెంచుకుంటాం…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

సంధ్య 70MM హిస్టరీ.. ఈ థియేటర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

వాళ్లంతా క్రిమినల్స్.. డైరెక్టర్లపై రెచ్చిపోయిన కోన వెంకట్!

‘రణబాలి’లో అంత మ్యాటర్ ఉందా.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే!

Big Stories

Advertisement
×