E-Paper
Advertisement

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?

వెంకీ ఆదర్శ కుటుంబం కొత్త విడుదల తేదీ ఇదే.. ఈసారైనా వస్తారా? లేదా?
Advertisement

Aadarsha Kutumbham Movie: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తూ సినిమా విడుదల సమయానికి వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతిసారి సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం పలు కారణాల వల్ల వాయిదా వేస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా దర్శక నిర్మాతల వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) సినిమా విడుదల విషయంలో వెంకీ అభిమానులు మాత్రం నిర్మాతలు నాగ వంశీ దర్శకుడు త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాగ వంశీ పై వెంకీ ఫ్యాన్స్ ఫైర్..

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2వ తేదీ విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు అనంతరం అక్టోబర్ 9వ తేదీ రాబోతోందని విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని నాగవంశీ తెలిపారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఈ సినిమా వాయిదా పడుతుందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు అంటూ మాట్లాడటంతో వెంకటేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదర్శ కుటుంబం సినిమా తదుపరి విడుదల ఎప్పుడు అంటూ అందరిలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదర్శ కుటుంబం తరచూ వాయిదా పడటంతో ఎన్నో సినిమాల విడుదలకు కూడా ఆటంకం కలుగుతుందని చెప్పాలి.

నవంబర్ 20న పక్కాగా వస్తారా?

Advertisement

ఇకపోతే నవంబర్, డిసెంబర్ నెలలో కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదర్శ కుటుంబం ఇప్పుడప్పుడే విడుదల అయ్యే అవకాశాలు లేవని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను నవంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఆదర్శ కుటుంబం సినిమా నవంబర్ 20వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారని సమాచారం.

త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ మొదటి సినిమా..

నవంబర్ నెలలో దీపావళి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి అందుకే ఆదర్శ కుటుంబం సినిమా నవంబర్ 20 నవిడుదల చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో వార్తలు బయటకు రావడంతో వెంకటేష్ అభిమానులు మాత్రం ఈ సారైన పక్కాగా విడుదల చేస్తారా? లేదంటే చివరి నిమిషంలో మళ్లీ వాయిదా వేస్తారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ విడుదల తేదీకి సంబంధించి అధికారక ప్రకటన రాబోతోందని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల కూడా భారీగా అంచనాలు ఉన్నాయి ఇందులో వెంకటేష్ జోడిగా శ్రీనిధి శెట్టి నటించారు.

Advertisement

Also Read: రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

Related News

అల్లు అర్జున్ భార్య అందానికి ఫ్యాన్స్ ఫిదా.. ఫొటోలు వైరల్

నాగవంశీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన నెటిజన్.. కారణం ఇదే!

రజనీకాంత్  భాషా సీక్వెల్  అందుకే చేయలేదా?కారణం అదేనా?

ఎక్కడ చూసినా జిమ్ జిమ్ తార.. ఇప్పుడు అనుపమ వంతు!. వైరల్ వీడియో

పిల్లలు పుట్టే వరకు వాటిని పెంచుకుంటాం…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

సంధ్య 70MM హిస్టరీ.. ఈ థియేటర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

వాళ్లంతా క్రిమినల్స్.. డైరెక్టర్లపై రెచ్చిపోయిన కోన వెంకట్!

Big Stories

Advertisement
×