Janhvi kapoor : జాన్వీ కపూర్(Janhvi Kapoor) ధడక్ సినిమా ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదివరకు ఈమె బాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అవతూ బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటించేవారు కానీ ఇటీవల కాలంలో సౌత్ సినిమాలపై కూడా దృష్టి సారించిన జాన్వీ ప్రస్తుతం వరుస సౌత్ సినిమాల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన పరం సుందరి(Param Sundari) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీ విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
ముగ్గురు పిల్లలు ఉండాల్సిందే..
ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా జాన్వీ కపూర్ వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పిల్లల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే జాన్వీ పలు సందర్భాలలో పెళ్లి పిల్లల గురించి మాట్లాడుతూ వచ్చారు. గతంలో కూడా తనకు ముగ్గురు పిల్లలు కావాలని చెప్పిన ఈమె తాజాగా పరం సుందరి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మరోసారి పిల్లల గురించి మాట్లాడారు అయితే తనకి ఎందుకు ముగ్గురు పిల్లలు కావాలనుకుంటున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.
లక్కీ నెంబర్ 3..
ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. నా లక్కీ నెంబర్ 3. పెళ్లి చేసుకున్న తర్వాత తాను కచ్చితంగా ముగ్గురు పిల్లలకు జన్మనిస్తానని వెల్లడించారు.ఆ ముగ్గురిలో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మూడో బిడ్డ ఎవరికీ సపోర్ట్ చేస్తారో నేను చూడాలని కోరుకుంటున్నాను. అయితే సందర్భం బట్టి వారి మద్దతు కూడా మారుతూ ఉంటుంది. ఇలా నా బిడ్డలు ముగ్గురు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ జాన్వీ తన పిల్లల గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
శిఖర్ పహారియాతో ప్రేమ…
ఇకపోతే ఈమె శిఖర్ పహారియా(Sikhar Pahariya)తో పీకల్లోకి ప్రేమలో మునిగి తేలుతున్నారు. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతూ కనిపిస్తున్నారు. ఇలా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఇప్పటివరకు పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు అయితే ప్రస్తుతం జాన్వీ తన దృష్టి మొత్తం కెరియర్ పైనే ఉన్న నేపథ్యంలో ఈమె పెళ్ళికి మరికాస్త ఆలస్యం అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె సౌత్ సినిమాల విషయానికొస్తే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా(Peddi Movie)లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదివరకే ఎన్టీఆర్ సరసన దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెద్ది ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా 2026 మార్చి 25వ తేదీ విడుదల కానుంది.
Also Read: Nivetha Thomas: 2 నెలల్లోనే భారీగా బరువు తగ్గిన నివేథా థామస్.. బాబోయ్ ఇప్పుడు ఏం ఉందిరా బాబు!