BigTV English

Nivetha Thomas: 2 నెలల్లోనే భారీగా బరువు తగ్గిన నివేథా థామస్.. బాబోయ్ ఇప్పుడు ఏం ఉందిరా బాబు!

Nivetha Thomas: 2 నెలల్లోనే భారీగా బరువు తగ్గిన నివేథా థామస్.. బాబోయ్ ఇప్పుడు ఏం ఉందిరా బాబు!

Nivetha Thomas: నివేథా థామస్(Nivetha Thomas) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా జెంటిల్ మెన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనకు సైమా అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగులో జై లవకుశ, బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్, నిన్ను కోరి వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో దూసుకుపోతున్న నివేథా థామస్  ఒకసారిగా తన శరీర బరువు పెరిగిపోవడంతో సినిమాలకు కూడా కాస్త దూరంగా ఉన్నారు. అయితే ఈమె అధిక శరీర బరువు ఉండటం వల్ల పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ కామెంట్లను కూడా ఎదుర్కొన్నారు. నివేథా థామస్  అధిక శరీర బరువు పెరిగిపోవడంతో ఈమె ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేశారు.


స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చిన నివేథా…

ఇకపోతే కొంతమంది హీరోయిన్లు సినిమాలలో నటించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నివేథా థామస్  కూడా 35 చిన్న కథ కాదు(35 Chinna Katha Kadu) సినిమా కోసం భారీ స్థాయిలో శరీర బరువు పెరిగిపోయారు. ఈ సినిమా  తరువాత ఈమె శరీర ఆకృతి పై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిలిం అవార్డు(Gaddar Film Awards) కార్యక్రమాలలో భాగంగా ఈమె సందడి చేశారు. అయితే అప్పుడు కూడా తన లుక్స్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే తన పట్ల ఎవరైతే బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారో వారికి తనదైన శైలిలోనే నివేథా థామస్  సమాధానం ఇచ్చారు.


రెండు నెలలలోనే ఇంత మార్పా?

తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక జరిగి దాదాపు రెండున్నర నెలలు అవుతుంది. అయితే ఈ రెండున్నర నెలల వ్యవధి కాలంలోనే ఈమె పూర్తిగా తన శరీర బరువు తగ్గిపోయి స్లిమ్ లుక్ లోకి వచ్చారు. ప్రస్తుతం నివేథా థామస్  సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటీ నివేథా థామస్  ఇంత స్లిమ్ గా మారిపోయింది అంటూ ఆశ్చర్య పోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే శరీర బరువు తగ్గి ట్రోలర్స్ కు తగిన సమాధానం ఇచ్చింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు నిత్యం వారి శరీర ఫిట్నెస్ పై శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ప్రయోగాత్మక సినిమాల కోసం ఇలాంటి సాహసాలు చేస్తుంటారని చెప్పాలి. గతంలో అనుష్క కూడా సైజ్ జీరో కోసం భారీగా శరీర బరువు పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అయితే ఈ సినిమా కోసం అనుష్క పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈమె తన శరీర బరువు కారణంగా మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్పాలి. కానీ నివేథా థామస్  మాత్రం అధిక శరీర బరువు ఉన్నప్పటికీ తన గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తున్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ప్రస్తుతం ఈమె స్లిమ్ అవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Mirai:మిరాయ్ అంటే ఏంటో తెలుసా? టైటిల్ వెనుక ఇంత అర్థం ఉందా..

Related News

Pawan Kalyan : పబ్లిక్ మీటింగ్ విడిచి… అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కళ్యాణ్

Allu Kanakaratnamma : మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అల్లు కనక రత్నమ్మ

Nani : నాని గురించి వాళ్ళ పిన్ని ఏం మాట్లాడారో తెలుసా? వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్

Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం

Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !

Big Stories

×