Big TV Kissik Talk Show : ప్రముఖ న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాం లను ప్రేక్షకులకు అందిస్తుంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల మనసు దోచుకున్న షో బిగ్ టీవీ కిసిక్ టాక్స్(Big TV Kissik Talk Show). జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి నటుడు, డైరెక్టర్ వెంకీ అట్లూరి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్బంగా సినిమాల గురించి ఎన్నో కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలతో సినిమాలు చెయ్యక పోవడానికి కారణాలను వివరించారు. ఈ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు..
ఇండస్ట్రీలో తొక్కేయ్యడం కామన్..
ఇండస్ట్రీలో మనం పరిగెడితేనే నిలబడతాము. ఒక్కసారి ఆగితే వెనకాల వాళ్లు వచ్చి తొక్కేస్తారు. కొత్తగా సాధించాలి అనే కసి ఉండాలి. సినిమా అంటే ఫ్యాషన్ మాత్రమే కాదు. కాస్త కష్టపడాలి అప్పుడే సక్సెస్ అవుతారు. ఇండస్ట్రీలో బురద చల్లేందుకు ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు. కానీ మనలో దమ్ము, ధైర్యం ఉంటే ఎవడికి తల వంచాల్సిన పరిస్థితులు రావు అని వెంకీ అట్లూరి అన్నారు. అంతేకాదు.. పాలిటిక్స్ ఉంటాయని విన్నాం అది నిజమేనా? అని వర్ష అడగ్గా.. ఎందులోనైనా పాలిటిక్స్ నడుస్తాయి. మనం గ్రహించి జాగ్రత్త పడితే సేఫ్ లేకుంటే అన్ని వదులుకోవాలి అని డైరెక్టర్ అంటున్నారు.
ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్..
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే కీర్తి.. తాను ముందుకు వెళ్ళింది. నేను అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్న.. ఎప్పటికి ఇండస్ట్రీలో నాకు బెస్ట్ అంటే తనే అని అన్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి..
Also Read: కేక్‌లో మందు బాటిల్.. ఎవరి కంట పడకుండా కొట్టేసిన సీనియర్ హీరో..
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తారా…?
డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగులో కన్నా ఇతర భాషల్లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు.. ఇటీవల ఆయన తెరకేక్కించిన సినిమాలు అన్ని తమిళ హీరోలతోనే ఉన్నాయి. అయితే ఈ విషయం పై వర్ష ఆయనను అడిగింది. తెలుగు హీరోలతో సినిమా వస్తుందా? అసలు మీరెందుకు తెలుగులో సినిమాలు చెయ్యలేదు. ఏదైన బలమైన కారణం ఉందా అని అడిగింది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. కారణాలు అయితే పెద్దగా లేవు. ఇద్దరు, ముగ్గురు హీరోలను కలిసాను. స్టోరీ గురించి చెప్పాను. వాళ్లు ఇంట్రెస్ట్ లేనట్లు అన్నారు. దాంతో ఇక్కడ సినిమాలు చెయ్యలేమని వేరే ఇండస్ట్రీ హీరోలతో సినిమాలు చేస్తున్నా అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగు సినిమాల గురించి బోలెడు సినిమాలను ఆయన వివరించారు.. వెంకీ అట్లూరి షేర్ చేసిన విషయాల గురించి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..