E-Paper
Advertisement

ఉల్లిపాయ అలెర్జీ కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళ.. ఈ అలెర్జీ ఎంత ప్రమాదకరమంటే

ఉల్లిపాయ అలెర్జీ కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళ.. ఈ అలెర్జీ ఎంత ప్రమాదకరమంటే
Advertisement

ఉల్లిపాయ అలెర్జీ చాలా అరుదుగా కనిపించే ఆరోగ్య సమస్య. అయితే ఇది కొందరిలో ప్రాణాపాయ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల అమెరికాలో ఓ మహిళకు ఈ అలెర్జీ తీవ్రంగా ఉండడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. కేవలం అలెర్జీ వల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె కంపెనీపై కోర్టులో కేసు వేయగానే ఈ అలెర్జీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

తన అలెర్జీ గురించి ముందుగానే యజమాన్యానికి తెలిసినా ఆఫీసులో తగిన రక్షణ చర్యలు తీసుకోలేదని కేసులో పేర్కొంది. కార్యాలయంలో ఉల్లిపాయల కారణంగా ఆమెకు పలుమార్లు తీవ్రమైన అలెర్జీ వచ్చి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చినట్లు ఆమె కోర్టుకు తెలిపింది.

ఆఫీసులో అసలు ఏం జరిగింది?

Advertisement

సదరు మహిళ 2024 మే నెలలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే సహోద్యోగులు తీసుకొచ్చిన ఉల్లిపాయల వల్ల ఆమెకు తీవ్రమైన అలెర్జీ సమస్య వచ్చింది. వైద్యులు ఆమె ఇంటి నుంచే పని చేయాలని లేదా ప్రత్యేక గదిలో పనిచేసే సదుపాయం కల్పించాలని సూచించారు. అయితే కంపెనీ తాత్కాలిక మార్పులు మాత్రమే చేసిందని కేసులో ఆమె పేర్కొన్నారు.
తీవ్రమైన అలెర్జీ వచ్చిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు బాధితురాలు కంపెనీ యజమాన్యంపై ఆరోపణలు చేసింది. అయితే కంపెనీ మాత్రం తాము అన్ని ఉద్యోగ నిబంధనలను పాటిస్తున్నామని తెలిపింది.

ఉల్లిపాయ అలెర్జీ అంటే ఏంటి?

ఉల్లిపాయలో ఉండే కొన్ని ప్రోటీన్లను శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ప్రమాదకరంగా గుర్తించినప్పుడు ఈ అలెర్జీ వస్తుంది. దీనికి ప్రతిస్పందనగా శరీరం హిస్టమిన్ వంటి రసాయనాలను విడుదల చేస్తుంది. ఫలితంగా వివిధ రకాల అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి ఉల్లిపాయ తిన్న తర్వాత సమస్య వస్తుంది. మరికొందరికి పచ్చి ఉల్లిపాయను తాకినా లేదా వండేటప్పుడు వచ్చే వాసన, ఆవిరి వల్ల కూడా అలెర్జీ రావచ్చు. ఉల్లిపాయ అలెర్జీ ఉన్నవారికి వెల్లుల్లి, షలాట్స్, చైవ్స్ వంటి కూరగాయల వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు.

ఉల్లిపాయ అలెర్జీ లక్షణాలు

Advertisement

అలెర్జీ లక్షణాలు కొన్ని నిమిషాల్లోనే కనిపించవచ్చు. కొన్నిసార్లు కొన్ని గంటల తర్వాత కూడా ప్రారంభమవుతాయి.

సాధారణంగా కనిపించే లక్షణాలు

  • చర్మంపై దురద, దద్దుర్లు లేదా ఎర్రటి మచ్చలు రావడం.
  • పెదవులు, నాలుక లేదా ముఖం వాపు రావడం.
  • తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో దురద కలగడం.
  • వికారం, వాంతులు, కడుపు నొప్పి లేదా విరేచనాలు రావడం.
  • దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా పిల్లికూతలు వినిపించడం.
  • తల తిరగడం లేదా నీరసంగా అనిపించడం.
  • ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే అలెర్జీ నిపుణుడిని సంప్రదించాలి.

Also Read: తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు కనిపిస్తున్నాయా? చికెన్ పాక్స్ లక్షణాలు కావచ్చు.. ఇలా తెలుసుకోండి

ఎప్పుడు ప్రాణాపాయం ఏర్పడుతుంది?

కొన్ని సందర్భాల్లో ఉల్లిపాయ అలెర్జీ అనాఫైలాక్సిస్ అనే తీవ్రమైన పరిస్థితికి దారితీయవచ్చు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి. గొంతు బాగా వాపు రావడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, రక్తపోటు ఒక్కసారిగా తగ్గిపోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అవసరమైతే ఎపినెఫ్రిన్ ఆటో ఇంజెక్టర్‌ను వెంటనే ఉపయోగించాలి.

అలెర్జీని ఎలా నివారించాలి?

ఉల్లిపాయలు ఉన్న ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండడం బెస్ట్. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబుల్స్ తప్పకుండా చదవాలి. హోటళ్లలో భోజనం చేసే ముందు అందులో ఉల్లిపాయలు ఉన్నాయా అని అడగాలి. తీవ్రమైన అలెర్జీ ఉన్నవారు ఎప్పుడూ ఎపినెఫ్రిన్ ఆటో ఇంజెక్టర్ వెంట ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు కూడా అత్యవసర పరిస్థితిలో ఎలా సహాయం చేయాలో తెలియజేయాలి.

Related News

పిల్లలను రోజూ స్కూల్ కోసం రెడీ చేయడం మరింత ఈజీ.. ఉదయం వేళ హడావుడిని తగ్గించే టిప్స్ ఇవిగో

మీ వయసు తగ్గించుకోవచ్చు తెలుసా? ఎక్కువకాలం యవ్వనంగా ఉండేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్

వర్షాకాలం బట్టల లొల్లి.. ఇంట్లోనే బట్టలు ఫాస్ట్‌గా ఆరాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

అద్దెకు ‘ప్రేయసి’.. ఒక్కో పనికి ఒక్కో రేటు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

తీవ్ర జ్వరం, శరీరంపై దద్దుర్లు కనిపిస్తున్నాయా? చికెన్ పాక్స్ లక్షణాలు కావచ్చు.. ఇలా తెలుసుకోండి

బాత్రూమ్‌లో చేసే ఈ 7 తప్పులు ఇంట్లో సమస్యలకు కారణం.. ఆర్థిక కష్టాలకు ఆహ్వానం

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఈ తేదీల్లో పుట్టినవారు టెన్షన్ తీసుకోరు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు

Big Stories

Advertisement
×