Jagapathi Babu: జగపతిబాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే ఒకానొక సమయంలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో జగపతిబాబు (Jagapathi Babu)విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్ పాత్రలలో నటిస్తున్న ఈయన హీరోగా కంటే కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు జగపతిబాబు హోస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammu) అని టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా ప్రసారం అయింది. ఇలా మొదటి సీజన్ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో జగపతిబాబు ఈ కార్యక్రమానికి రెండవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి గెస్ట్ కి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. సీజన్ 2 లో ఈ కార్యక్రమానికి ఫస్ట్ గెస్ట్ గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి ని ఆహ్వానించిన జగపతిబాబు ఫిదా(Fidaa) సినిమా తర్వాత నేను నీకు ఫిదా అయ్యాను అంటూ చెప్పగా సాయి పల్లవి షాక్ అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత నేషన్ మొత్తం నీకు ఫిదా అయ్యింది అంటూ జగపతిబాబు చెప్పుకు వచ్చారు అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ .. సాయి పల్లవి క్రష్ గురించి తెలియజేయడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి గురించి ప్రేక్షకులకు తెలియని విషయాలను జగపతిబాబు బయట పెట్టబోతున్నారని తాజాగా ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమం ఈ ఆదివారం సాయంత్రం7:30 నిమిషాలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.
This Sunday 7:30 PM.
It's a BLAST ❤️🔥❤️🔥❤️🔥🔥🔥🔥🔥Tq for doing this @Sai_Pallavi92 🤧#saipallavi pic.twitter.com/RQL2krvkoG
— PEACE 🏹 (@Peace__AB) October 12, 2026
ఇక సాయి పల్లవి ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సౌత్ సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయి పల్లవి ధనుష్ 55 వ సినిమాలో హీరోయిన్గా సందడి చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ (Ramayan) సినిమాలో ఈమె సీత పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ ఆరవ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలోనే సాయి పల్లవి ప్రమోషన్లలో భాగంగా జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 టాక్ షోలో పాల్గొన్నారని తెలుస్తోంది.
Also Read: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!