E-Paper
Advertisement

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!
Advertisement

Jim Jim Tara Song:‘జిమ్ జిమ్ తారా’.. ‘జిమ్ జిమ్ తారా’..జిలేబి తేరా చిన్నోడా అంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పాట పర్ణ శాల సినిమాలోనిది అన్న సంగతి తెల్సిందే .ఇక ఇప్పటికే పలు రకాలుగా ఫేమస్ అయిన ఈ పాట ఎట్టకేలకి అఫీషియల్ గా లిరికల్ వీడియో రూపంలో వచ్చేసింది.

ఒరిజినల్ పాటని పాడిన గోగుల లక్ష్మీదేవి గారే

Advertisement

కార్తికేయ, అన్యుక్త నల్లాని హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ దీనిని నిర్మిస్తున్నారు. ఇక వినయ్ శశిధర్ సంగీతంలో ఒరిజినల్ పాటని పాడిన గోగుల లక్ష్మీదేవి గారే మళ్ళీ పాడటం విశేషం.మొత్తంగా ఇప్పటికే అటు సోషల్ మీడియాని,ఇటు సేలెబ్రిటీలని షేక్ చేస్తున్నఈ ‘జిమ్ జిమ్ తారా పాట పర్ల శాల సినిమాకి మరింత హైప్ తెస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయానికి వస్తే అజయ్ ఘోష్, చందు జేసీ, జోషి, దేవీ ప్రసాద్, అనితా చౌదరి, విష్ణు ఓఐ, బద్రం, ఫన్ బకెట్ ఫణి, నంద కిషోర్, బిందు చంద్ర మౌళి, సలీం ఫేకు తదితరులు నటిస్తున్నారు.

Advertisement

టెక్నీషియన్స్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫర్ గా శ్రీనివాస్ బెజుగం, ఎడిటర్‌గా శ్రీనివాస్ బైనబోయిన పనిచేస్తున్నారు.ఇక ప్రొడక్షన్ డిజైనర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా హ్యాండవి కృష్ణన్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పోస్టర్ డిజైనర్‌గా ధనీ ఏలే పనిచేస్తుండగా, పీఆర్ బాధ్యతలను దయ్యాల అశోక్ నిర్వహిస్తున్నారు.

సింగర్ విషయానికి వస్తే

ఈ పాట పాడిన సింగర్ విషయానికి వస్తే ఆవిడ పేరు గోకుల లక్ష్మీదేవి.అయితే సోషల్ మీడియాలో ఆమెని లక్ష్మీ ఆంటీగా పిలుస్తు తమ అభిమనాన్ని ప్రదర్శిస్తున్నారు నెటిజన్లు.ఇక ఈవిడ రాయలసీమ లోని కర్నూల్ ప్రాంతానికి చెందినదని తెలుస్తుంది.

అయితే ఇపుడు బాగా పాపులర్ అయిన జిమ్ జిమ్ తార..జిలేబి తేరా చిన్నోడా పాట మాత్రమే కాదండోయ్ ….గతంలో అత్తరు సాయిబో రారా అంటూ మరో పాటని కూడా పాడి వార్తల్లో నిలిచింది.బహుశా అప్పట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేని కారణంగా ఇంతగా వైరల్ అవ్వలేదు కాబోలు.

ఈ ‘జిమ్ జిమ్ తారా’..పర్ణ శాలకి ఎలా పనికివస్తుందో !

ఇక కేవలం ఫోక్ టచ్ ఉన్న పాటలు మాత్రమే కాకుండా భక్తిగీతాలని కూడా ఈవిడ పాడుతుందని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పాట సింపుల్ గా ఈజీగా క్యాచీగా పాడుకునేందుకు అనువుగా ఉండటం వల్లే నెటిజన్లు ఈ పాటని ఎక్కువగా ఇష్టపడేందుకు కారణం అని తెలుస్తుంది.దీనికి తోడు లక్షీ అంటి పాడే తీరు, ఆమె గొంతులో ఉన్న స్పెషాలిటీ వల్ల ఈ పాట కి ఒక యునిక్ నెస్ వచ్చిందని చెప్పాలి.

చూడాలి మరి నెట్టింటిని షేక్ చేస్తున్న ఈ ‘జిమ్ జిమ్ తారా’..పర్ణ శాలకి ఎలా పనికివస్తుందో !

ALSO READ :తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

 

Tags

Related News

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. జటాయువు పాత్రలో స్టార్ సెలబ్రిటీ!

ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?

గీతా గోవిందం, రంగస్థలం వదులుకున్న అనుపమ..కారణం?

300 ఎకరాల్లో ఫిలిం స్టూడియో నిర్మిస్తున్న బడా ప్రొడ్యూసర్స్.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×