Telangana Folk Songs:జానపదం అంటేనే జనాల్లో పుట్టిన పదం అని.అలాంటి జానపదాలకి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఒక్కో పాట కోట్ల వ్యూస్ కొల్లగొట్టడం మనం చూస్తూనే ఉంటాం.మరి అయితే ఒకప్పుడు కేవలం బరాత్ లలోనో,లేక బతుకమ్మ సంబరాలల్లోనో వినిపించిన జానపదాలు ఇపుడు సినిమాల్లో కూడా పాగా వేస్తున్నాయ్ .
అయితే కొంతకాలం క్రితం వరకు అడపా దడపా సినిమాలల్లో ఈ జానపదాలు కనిపించినప్పటికీ ఈ మధ్య కాలంగా సినిమాలలో మరింత ఎక్కువ జోరు చూపించడం మనం చూస్తూనే ఉన్నాం.మరీ ముఖ్యంగా కాసర్ల శ్యామ్ , మిట్టపల్లి సురేందర్ వంటి రచయితలు తమ కలానికి మరింత పదును పెడుతుండగా రామ్ మిరియాల, మధుప్రియ, మంగ్లి,వంటి సింగర్స్,సురేష్ బొబ్బిలి వంటి సంగీత దర్శకులు ఈ పాటలకి మరింత జీవం పోస్తున్నారు.మరి గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో దుమ్మురేపిన ఆ తెలంగాణా పాటలేంటో ఏ ఏ సినిమాల్లో వచ్చి మనల్ని అలరించాయో ఒక సారి చూసేద్దాం.
రాములో రాముల
ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో దుమ్ము రేపిన తెలంగాణా ఫోక్ టచ్ ఉన్న పాటగా చెప్పుకోవాలంటే ముందుగా రాములో రాముల పాటనే చెప్పుకోవాలి. అవును ..అల్లు అర్జున్ హీరోగా నటించిన‘అల వైకుంఠపురములో’వచ్చిన ఈ పాటని కాసర్ల శ్యామ్ రాయగా, తమన్ సంగీతంలో అనురాగ్ కులకర్ణి,మంగ్లీ కలిసిపాడారు.2020లో వచ్చిన ఈ పాట ఇప్పటి వరకు ఏకంగా 80 కోట్ల వ్యూస్ కొల్లగొట్టి తెలంగాణా జానపదానికున్న పవర్ ని ప్రపంచానికి పరిచయం చేసింది.ఇక ఈ పాట ఇప్పటికీ చాలా ఈవెంట్స్ ,పంక్షన్స్,పార్టీలలో మనకు వినిపిస్తుంది కూడా.
డిజే అన్నా టిల్లు పెడితే
ఇక సిద్దు జొన్నలగడ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమాలోని డిజే అన్నా టిల్లు పెడితే అనే పాట ఆడియన్స్ ని ముఖ్యంగా యూత్ ని ఎంతలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు.ఒక రకంగా సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఈ పాట ఒక మెయిన్ రీజన్ అని చెప్పాలి. రామ్ మిరియాల సంగీతంలో తనే స్వయంగా పాడిన ఈ పాటని కూడా కాసర్ల శ్యామే రాయడం విశేషం.ఇక 2022లో వచ్చిన ఈ పాట ఇప్పటి వరకు దాదాపు 40కోట్ల వ్యూస్ కొల్లగొట్టి ఫోక్ సాంగ్ సత్తా చూపించింది.
‘వచ్చిందే’
ఇక వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ఆడియన్స్ ని ఎలా ఫిదా చేసిందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చిన ‘వచ్చిందే’ అనే పాట ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది. ముఖ్యంగా ఏ పెళ్లి అయినా ఈ పాట మాత్రం చాలా కామన్ అన్నట్టుగా మారిపోయింది.
శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ పాటని సుద్దాల అశోక్ తేజ రాయగా మధుప్రియ, రామ్కీ తమ గాత్రంతో పాటని మరో మెట్టు ఎక్కించారనే చెపాలి. ఇక 2017లో వచ్చిన ఈ పాట ఏకంగా 39కోట్ల వ్యూస్ ని కొల్లగొట్టడం విశేషం.
సారంగ దరియా
ఇక ఇదే సినిమాలో వచ్చిన సారంగ దరియా పాటది మరో లెవెల్. ఈ పాట కూడా సుద్దాల అశోక్ తేజ రచనలోనే మంగ్లీ పాడిన ఈ పాట కూడా 38 కోట్ల వ్యూస్ ని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.నిజంగా ఈ పాట సక్సెస్ వల్లనే తెలుగు సినిమాలలో జానపదాలకి మరింత డిమాండ్ పెరిగిందని చెప్పాలి.
చంకీల అంగీలేసి
ఇక నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమాలోని చంకీల అంగీలేసి.. పాట ఎంతటి పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ రచనలో వచ్చిన ఈ పాటని రామ్ మిరియాల, ధీ కలిసి పాడగా ఈ పాట ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల వ్యూస్ రాబట్టడం విశేషం.ఇప్పటికీ చాలా బరాత్ లలో ఈ పాట మనకి వినిపిస్తుంది కూడా .
‘ఊరు పల్లెటూరు’
ఇక ప్రియదర్శి నటించిన బలగం సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’పాట కూడా ఆడియన్స్ లో మంచి క్రేజే సంపాదించింది.బీమ్స్ సిసిరీలియో దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని మంగ్లీ చాలా అధ్బుతంగా పాడి మెప్పించింది.ఇక ఈ పాట ఇప్పటి వరకు5.45 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతుండటం విశేషం.
ఆడియన్స్ ని మెప్పించి సత్తా చాటినవే
ఇక వీటితో పాటు ‘సీటీమార్’ సినిమాలోని ‘జ్వాలా రెడ్డి’, ‘ధమాకా’ సినిమాలోని ‘జింతాక్’ పాటలు కూడా ఆడియన్స్ ని మెప్పించి సత్తా చాటినవే !మొత్తంగా తెలుగు సినిమాల పాటలంటే ఇలాగే ఉండాలి అన్న నానుడిని ఈ పాటలు ఒక రకంగా బ్రేక్ చేశాయనే చెప్పాలి !