E-Paper
Advertisement

ఎన్టీఆర్ కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్?.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్

ఎన్టీఆర్ కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్?.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్
Advertisement

NTR Dragon: డ్రాగన్ సినిమా ఆగిపోయిందని,స్క్రిప్ట్ నచ్చక తారక్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడంటూ చక్కర్లు కొడుతున్న రూమర్స్ కి మైత్రి మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు తారక్ ఫ్యాన్స్. సినిమా భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ లో ప్లాన్ చేస్తున్నామని,అందులో భాగంగా ఫారిన్ లొకేషన్ కోసం చేస్తున్న ప్రిపరేషన్ లో భాగంగానే కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందని కన్ఫాం చేసేసింది.

టెక్నికల్ పరంగా ఇండియన్ స్క్రీన్‌పై ఒక కొత్త బెంచ్‌మార్క్

Advertisement

ఇక నీల్ సినిమాలంటేనే హై వోల్టేజ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్. అందుకు తగ్గట్టుగా ఇలా గ్యాప్ తీసుకుంటూ షూట్ చేయడం కామన్ అని, ఇదే ప్లానింగ్ K.G.F, సలార్ సినిమాల టైం లో కూడా తీసుకుని జువల్ క్వాలిటీపై ఎక్కువ దృష్టి పెట్టారని ట్రేడ్ పండిట్స్ చెబుతున్న మాట.ఇక ఈ సినిమా టెక్నికల్ పరంగా ఇండియన్ స్క్రీన్‌పై ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎక్కువగా డార్క్ థీమ్ కనిపించింది.

కోల్ మైన్స్, క్రైమ్ వరల్డ్ లేదా అండర్‌వర్డ్ బ్యాక్‌డ్రాప్‌లతో ఆయన సినిమాలు విజువల్‌గా చాలా హెవీ టోన్‌లో ఉంటాయన్న సంగతి తెల్సిందే.కానీ ఈసారి అదే ఫార్ములాను రిపీట్ చేయకుండా ఒక డిఫరెంట్ విజువల్ లాంగ్వేజ్‌ను ప్రయత్నిస్తున్నాడట నీల్.అందులో భాగంగా న్యాచురల్ లైటింగ్, భారీ ల్యాండ్‌స్కేప్స్ మరియు రియలిస్టిక్ యాక్షన్ టోన్‌తో ఈ సినిమా హాలీవుడ్ యాక్షన్ సినిమాల తరహాలో తీర్చిదిద్దబోతున్నాడని వినిపిస్తున్న టాక్.

Advertisement

also read:అఖిల్ బర్త్ డే బ్లాస్ట్.. అయ్యగారి పోస్టర్ ‘కిర్రాక్’ కానీ అప్డేట్ ‘తుస్’! అన్నపూర్ణ స్టూడియోస్ పై ఫ్యాన్స్ ఫైర్!

AI తో క్రియేట్ చేస్తూ మురిసిపోతున్న తారక్ ఫ్యాన్స్

ఇక  ఈ సినిమా కోసం Jr. NTR శారీరకంగా కూడా ఓ రేంజ్ లో హార్డ్ వర్క్ చేస్తున్నాడని ముఖ్యంగా కేరళకు చెందిన పురాతన యుద్ధ విద్య అయిన కలరిపయట్టు ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం.అయితే అది పబ్లిసిటీ కోసం కాకుండా సినిమాలో దాదాపు పది నిమిషాల పాటు కొనసాగే హై వోల్టేజ్ ఫైట్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం  ప్రత్యేకంగా ఈ శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇక ఈ ఫైట్‌లో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, స్పీడ్ మరియు ఫ్లెక్సిబిలిటీ మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతుందని, లాంగ్ టేక్స్, రియల్ స్టంట్స్, మినిమమ్ వీఎఫ్‌ఎక్స్‌తో ఈ యాక్షన్ సీక్వెన్స్ ని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయ్.

ఇక అప్పుడెప్పుడో సినిమా మొదలైనప్పుడు ఓ యాక్షన్ సీక్వెన్స్ పిక్ వదిలిన మేకర్స్ ఇప్పటికీ సరైన అప్ డేట్ వదలకపోవడంతో మేమాగలెం అంటూ తమకి నచ్చినట్టుగా తారక్ కలరియపట్టు నేర్చుకుంటున్నట్టుగా ఫోటోలని AI తో క్రియేట్ చేస్తూ మురిసిపోతున్నారు తారక్ ఫ్యాన్స్.మరికొంత మంది  అయితే ఒక అడుగు ముందుకు వేసి అసలు కన్నా ఇవే అధ్బుతంగా ఉన్నాయ్ గా అంటూ  కామెంట్స్ చేయడం విశేషం.ఇక ఆ మధ్య బక్కచిక్కినట్టుగా ఉన్న తారక్ ఈ ఫోటోలలో సాలిడ్ గా ట్రాన్స్ ఫార్మ్ అయినట్టు ఉండటం మరో విశేషం.

ఎన్టీఆర్,అనిల్ కపూర్ మధ్య జరిగే మైండ్ గేమ్స్

ఇక సినిమా క్యాస్టింగ్  విషయానికి వస్తే బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఇందులో కీ రోల్ పోషిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఆయన ఇందులో పూర్తిగా విలన్ కాకుండా ఒక గ్రే షేడ్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడని ముఖ్యంగా ఎన్టీఆర్,అనిల్ కపూర్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ సినిమాకు హైలైట్ అవుతాయని సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం విదేశీ షూటింగ్ లొకేషన్స్. జోర్డాన్ మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

భారీ డెజర్ట్ ల్యాండ్‌స్కేప్స్, వైడ్ విజువల్స్ మరియు రియలిస్టిక్ యాక్షన్ వాతావరణం కోసం ఈ లొకేషన్స్ ఎంచుకున్నారని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దాదాపు 125 కోట్ల రూపాయలకు పైగా ఈ డీల్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.చూడాలి మరి ఫ్యాన్స్ కి పని పెట్టకుండా మేకర్సే ఏమైనా సాలిడ్ డేట్స్ వదులుతారో లేక మీ క్రియేటివిటీనే బాగుంది అంటూ అభిమానులకే మరిన్ని ఛాన్సులు ఇస్తారో !

also read:‘జైలర్ 2’ని చుట్టుముడుతున్న కష్టాలు..

Related News

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

Big Stories

Advertisement
×