E-Paper
Advertisement

ప్రాణాలు తీసే పాత అద్దం… కళ్ళు మూసి తెరిచేలోపే ఖేల్ ఖతం

ప్రాణాలు తీసే పాత అద్దం… కళ్ళు మూసి తెరిచేలోపే ఖేల్ ఖతం
Advertisement

Horror thriller OTT : దెయ్యాల సినిమాలు భయపెడుతున్నా కూడా, వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఆడియన్స్. అయితే కొన్ని సినిమాలు కథనం, హారర్ ఎలిమెంట్స్ తో క్రేజీగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇది ఒక అద్దం చుట్టూ తిరుగుతుంది. అయితే అది మామూలు అద్దం కాదు. దుష్ట శక్తి తిష్ట వేసిన అద్దం. ఇది ఒక ఫ్యామిలిలో ఎంటర్ అయ్యాక స్టోరీ భయంకరమైన మలుపులు తిరుగుతుంది. అయితే ఈ సినిమాలోని భయంకరమైన సన్నివేశాల కోసం గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా సైకలాజికల్ హర్రర్‌పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇందులో ఒక అమ్మాయి ఆపిల్ పండు అనుకుని పొరపాటున గాజు బల్బును కొరికే సీన్ ప్రేక్షకులను బాగా భయపెట్టింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ వల్ల 2017లో హిందీలో హూమా ఖురేషి, సాకిబ్ సలీమ్ ప్రధాన పాత్రల్లో ‘దోబారా: సీ యువర్ ఈవిల్’ అనే పేరుతో రీమేక్ కూడా చేశారు.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సైకలాజికల్ హర్రర్ చిత్రం పేరు ‘ఓకులస్’ (Oculus). 2013లో వచ్చిన ఈ సినిమాకు మైక్ ఫ్లానాగన్ దర్శకత్వం వహించారు.
ఇందులో కరెన్ గిల్లాన్, బ్రెంటన్ త్వైట్స్, కేటీ సాక్‌హాఫ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాను కేవలం 5 మిలియన్ డాలర్ల (దాదాపు 40 కోట్లు) తక్కువ బడ్జెట్‌తో నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద 44 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి పెద్ద విజయాన్ని అందుకుంది. దర్శకుడు మైక్ ఫ్లానాగన్ తన మిగతా సినిమాలైన ‘హంటింగ్ ఆఫ్ హిల్ హౌస్’, ‘డాక్టర్ స్లీప్’, ‘జెరాల్డ్స్ గేమ్’ లలో కూడా ఈ లాసర్ గ్లాస్ అద్దాన్ని ఒక గుర్తుగా ఎక్కడో ఒకచోట చూపిస్తుంటారు. ఈ సినిమా షూటింగ్ కేవలం 24 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV)లో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

చిన్నప్పుడు కైలీ, టిమ్ అనే అక్కాతమ్ముళ్ల ఇంట్లోకి ఒక పాత వింత అద్దం వస్తుంది. ఆ అద్దం మామూలుది కాదు, దానికి ఒక దెయ్యం పట్టినట్టు వింత శక్తులు ఉంటాయి. అది ఇంట్లో ఉన్నవాళ్ల బుర్రల్ని తినేసి, లేనివి ఉన్నట్టు భ్రమలు కల్పిస్తుంది. ఆ అద్దం మాయలో పడి వాళ్ల నాన్న పిచ్చోడైపోయి వాళ్ల అమ్మను చంపేస్తాడు. చివరికి టిమ్ చేతిలోనే నాన్న చనిపోతాడు. ఈ గొడవతో టిమ్ జైలుకు వెళ్తే, అద్దం మాత్రం ఎవరికీ దొరక్కుండా మాయమైపోతుంది. పదేళ్ల తర్వాత టిమ్ జైలు నుండి బయటకు రాగానే, అక్క కైలీ మళ్లీ ఆ పాత అద్దాన్ని వెతికి పట్టుకొస్తుంది. మన జీవితాలు నాశనం చేసింది ఈ అద్దమే, దీన్ని అందరి ముందు నిరూపించి పగలగొట్టాలని పంతం పడుతుంది.

ఇక అద్దం చుట్టూ కెమెరాలు, సెన్సార్లు పెట్టి ఒక ప్రయోగం మొదలుపెడుతుంది. టిమ్ మొదట్లో ఇవన్నీ నమ్మకపోయినా, అద్దం తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాక అసలు ఆట మొదలవుతుంది. ఇప్పుడు అద్దం తన మాయతో వాళ్లకు పిచ్చెక్కిస్తుంది. కైలీ ఒక యాపిల్ పండు తింటున్నాను అనుకుంటే, నిజానికి అది ఒక గాజు బల్బ్ అని తర్వాత తెలుస్తుంది. అలా ఏది నిజమో ఏది అద్దం చూపిస్తున్న భ్రమో తెలియకుండా చేస్తుంది. ఈ క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. చివరికి వీళ్ళు ఆ గాజు అద్దం వెనుక అసలు సీక్రెట్ ను రికార్డ్ చేస్తారా ? ఆ అద్దం చేతిలో వీళ్ళు కూడా బలి అవుతారా ? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ ఉత్కంఠంగా ముగుస్తుంది.

Advertisement

Read Also : సబ్బు బిళ్ళతో తారుమారైన కథ.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కామెడీ మూవీ

Related News

విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

సినిమా ప్రపంచం వెనుక ఉన్న అసలు రంగులు… నవ్వులతో పాటు కన్నీళ్లు పెట్టించే వినోదాత్మక ప్రయాణం

జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

ప్రేయసిని మర్చిపోవడానికి వెళ్లిన హీరోకు షాకింగ్ ట్విస్ట్… ట్రెక్కింగ్‌లో ఎక్స్ ఎంట్రీతో ఊహించని మలుపు

కుటుంబ బంధాలను సైతం బలితీసుకునే పొలిటికల్ యాక్షన్ డ్రామా… విశాల్ గ్యాంగ్ స్టర్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

ఏళ్లుగా క్రికెట్ రైవల్రీ… గేమ్ కోసం మొదలైన గొడవ కుల వివక్షపై పోరుగా మారితే… ఓటీటీలో సూపర్ స్పోర్ట్స్ డ్రామా

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

Big Stories

Advertisement
×