Jr.NTR: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr. NTR)త్వరలోనే వార్ 2 (War 2)అనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో బాలీవుడ్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ త్వరలోనే హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి నటించిన వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
భాషతో సంబంధం లేదు..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇలా ఉన్నఫలంగా బాలీవుడ్ సినిమాలో నటించడానికి గల కారణం ఏంటి అనే సందేహం ఎంతోమందిలో కలిగింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ అసలు తాను ఎందుకు వార్ 2 సినిమా చేశాననే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు భాషా బేధం ఉండేది కానీ ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా వివిధ భాషలలో సినిమాలు ప్రసారమౌతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
హృతిక్ రోషన్ తో నటించడం…
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. వార్ 2 సినిమా కోసం భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేశారు. ఇకపై ఇండస్ట్రీలో బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అని భేదాలు ఉండవని, మనమంతా ఒకటే ఇండస్ట్రీ అని తెలియజేశారు. ఈ సినిమాలో తాను నటించడానికి ప్రధాన కారణం ఈ సినిమా స్క్రిప్ట్ అని వెల్లడించారు. అద్భుతమైన కథతో ఈ సినిమా రూపొందించిన నేపథ్యంలోనే తాను ఈ సినిమాలో నటించడానికి చాలా ఆసక్తి చూపించానని అలాగే ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కూడా కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేయటానికి ప్రధాన కారణం తెలియజేశారు.
ఎన్టీఆర్ ను ఆకట్టుకున్న స్క్రిప్ట్..
ఇక స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా తారక్ చెప్పడంతో ఈ సినిమా పట్ల అభిమానులలో కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఇక మొదటిసారి ఎన్టీఆర్ ఇలా బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాల ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఆగస్టు 14వ తేదీ రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వం వహించగా యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ కు మొట్టమొదటి బాలీవుడ్ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?